Begin typing your search above and press return to search.

18 పేజెస్ ప్రేమ‌లేఖ‌లో నిఖిల్ ఏం రాశాడు?

By:  Tupaki Desk   |   18 March 2021 6:30 AM GMT
18 పేజెస్ ప్రేమ‌లేఖ‌లో నిఖిల్ ఏం రాశాడు?
X
జీఏ 2 సంస్థ‌లో `100 ప‌ర్సంట్ ల‌వ్` లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు సుకుమార్. ఆర్య ఆర్య 2 త‌ర్వాత టీనేజీ ప్రేమ‌క‌థ‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి స‌త్తా చాటాడు.. ఆ త‌ర్వాత సుకుమార్ రైటింగ్స్ ని ప్రారంభించి కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రేమ‌క‌థా చిత్రాన్ని త‌న శిష్యుడు ప్ర‌తాప్ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించాడు. ఈ సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించింది. ఓవైపు పెద్ద హీరోల‌తో సినిమాలు తీస్తూనే త‌న శిష్యుల్ని ద‌ర్శ‌కులుగా ప‌రిచ‌యం చేస్తూ నిర్మాత‌గా సుకుమార్ రైటింగ్స్ లో వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్లు కొడుతున్నాడు. త‌న టీమ్ కి అవ‌స‌ర‌మైన స్టోరి ఎంపిక స‌హా స్క్రిప్టు ర‌చ‌న విభాగంలో సుకుమార్ సాయం పెద్ద రేంజులో వ‌ర్క‌వుట‌వుతోంది.

ఇటీవ‌లే ఉప్పెన తో ఇండ‌స్ట్రీ రికార్డ్ బ్రేకింగ్ హిట్ సాధించాడు. ఈ సినిమాతో త‌న శిష్యుడు బుచ్చిబాబు సాన‌కు మంచి పేరొచ్చింది. అలాగే డెబ్యూ హీరో వైష్ణ‌వ్ తేజ్ ఎదురే లేని ఆరంగేట్రం చేశాడు. ఇదంతా సుకుమార్ రైటింగ్స్ క్రెడిట్. ఇక ఈ మూవీతో పాటు సుకుమార్ రైటింగ్స్ నుంచి పుట్టుకొచ్చిన స్క్రిప్టుతో నిఖిల్ 18 పేజెస్ రెడీ అవుతోంది. `18 పేజెస్‌`ని మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో బ‌న్నీ వాసు నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి క‌థ‌- స్క్రీర్‌ ప్లే తో పాటు నిర్మాణ భాగ‌స్వామిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. `కుమారి 21 ఎఫ్‌` ఫేమ్ ప‌ల్నాటి సూర్య‌ప్ర‌తాప్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌.

ఇప్ప‌టికి 75 శాతం షూటింగ్ పూర్త‌యింద‌ని తెలిసింది. పుష్ప చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న‌ సుకుమార్ కాస్త ఫ్రీ అయిన వెంట‌నే రెడీ అయిన‌ వెర్ష‌న్ చూసి.. త‌దుప‌రి షెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది. కార్తికేయ‌తో చావు క‌బురు చ‌ల్ల‌గా చిత్రాన్ని హిట్ చేసి ఆ త‌ర్వాత 18 పేజెస్ ప్ర‌మోష‌న్ పైనా పూర్తి స్థాయిలో జీఏ2 సంస్థ ఫోక‌స్ చేయ‌నుందిట‌. ఇక ఈ మూవీ 18 పేజెస్ అన్న టైటిల్ కి త‌గ్గ‌ట్టే పూర్తి స్థాయి ఎమోష‌న‌ల్ ప్రేమ‌క‌థా చిత్ర‌మ‌ని తెలుస్తోంది.