Begin typing your search above and press return to search.

ఇక ఆగేదిలేదంటున్న యంగ్ హీరో!

By:  Tupaki Desk   |   13 Jun 2022 8:30 AM
ఇక ఆగేదిలేదంటున్న యంగ్ హీరో!
X
మొదటి నుంచి కూడా నిఖిల్ డిఫరెంట్ కంటెంట్ వైపు వెళుతున్నాడు. కొత్తదనం ఉన్న కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ వస్తున్నాడు. తన సినిమాల బడ్జెట్ పెరగకుండా చూసుకుంటూ .. తన మార్కెట్ తగ్గకుండా జాగ్రత్తపడుతూ వస్తున్నాడు. నిఖిల్ తన కెరియర్ ను మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆడియన్స్ తో గ్యాప్ రాకుండా చూసుకున్నాడు. కానీ ఈ సారి అనుకోకుండానే గ్యాప్ పెరిగిపోయింది. అందుకు ఒక కారణం కరోనా అయితే, మరో కారణం ఈ సారి ఆయన ప్లానింగు దెబ్బతినడమేననేవారు లేకపోలేదు.

'అర్జున్ సురవరం' తరువాత నిఖిల్ నుంచి సినిమా రావడంలో ఆలస్యం జరిగిన మాట నిజమే. అయితే అక్కడ వచ్చిన ఆ గ్యాప్ ను ఈ ఏడాదిలో ఫిలప్ చేయడానికి అన్నట్టుగా ఆయన వరుస ప్రాజెక్టులను లైన్లో పెట్టేశాడు.

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'కార్తికేయ 2' రెడీ అవుతోంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను జూలై 22వ తేదీన విడుదల చేయనున్నారు. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా అలరించనున్న ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి.

ఇక ఆ తరువాత గీతా ఆర్ట్స్ 2లో చేసిన '18 పేజెస్' సినిమా, సెప్టెంబర్ లో విడుదల చేయనున్నారు. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించి న ఈ సినిమాలోను కథానాయిక అనుపమనే కావడం విశేషం.

ఈ రెండు సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఆ తరువాత ఏడాది ప్రథమార్ధంలోనే ఆయన రెండు సినిమాలను దింపడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఒకటి గ్యారీ బీహెచ్ దర్శకత్వంలోని 'స్పై' సినిమా .. రెండోది సుధీర్ వర్మ దర్శకత్వంలోని మరో సినిమా. దీనికి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు.

ఇలా నిఖిల్ నాలుగు ప్రాజెక్టులను లైన్లో పెట్టేసుకుని కూర్చున్నాడు. ఒకదాని తరువాత ఒకటిగా ఇవి థియేటర్లలో దిగిపోనున్నాయి. ఈ నాలుగు సినిమాల తరువాత నిఖిల్ మళ్లీ చందూ మొండేటి దర్శకత్వంలో మరో సినిమాను చేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పై కసరత్తు నడుస్తోందట. ఇది ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా కావడం విశేషం.