Begin typing your search above and press return to search.

పార్టీకి ఇంకా టైమ్ పడుతుంది

By:  Tupaki Desk   |   8 Feb 2018 5:01 PM GMT
పార్టీకి ఇంకా టైమ్ పడుతుంది
X
స్వామిరారా సినిమా నుంచి సినిమాలను చాలా వెరైటీగా ఎంచుకుంటూ మంచి హిట్స్ అందుకుంటున్న నిఖిల్ ఏ మాత్రం తొందరపడటం లేదు. ఎలాగైనా సక్సెస్ ట్రాక్ ను మిస్ చేసుకోవద్దని సక్సెస్ ఫుల్ స్టోరీలను చేస్తున్నాడు. కేశవా లాంటి హిట్ తరువాత నిఖిల్ చేస్తోన్న సినిమా కిర్రాక్ పార్టీ. మలయాళం హిట్ సినిమా కిరిక్ పార్టీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై గత కొంత కాలంగా అనేక రూమర్స్ వస్తున్నాయి.

అసలైతే సినిమా ఫిబ్రవరి 9న రిలీజ్ కావాలి. దాదాపు అన్ని పనులను పూర్తి చేసుకొని లవర్స్ డే స్పెషల్ మూడ్ లో సినిమా రాబోతోందని చిత్ర యూనిట్ చాలాసార్లు చెప్పింది. కానీ మెగా హీరోల సినిమాలు మధ్య పోటీ ఎక్కువగా ఉండడంతో తప్పుకున్నాడని సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి. అయితే రీసెంట్ గా నితిన్ వాటికి చెక్ పెట్టె ప్రయత్నం చేశాడు. సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడని చాలా మంది అడుగుతున్నారు.

చాలా వర్క్ ఇంకా ఫినిష్ కావాల్సి ఉంది. డైరెక్టర్ అండ్ టెక్నీషియన్స్ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. మంచి సినిమాను ఇవ్వాలని అందరు కష్టపడుతున్నారు. ఫైనల్ గా బెస్ట్ అవుట్ రాగానే సినిమా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయనున్నట్లు నిఖిల్ స్పెషల్ గా తెలిపాడు. ఇక సినిమాలో సిమ్రాన్ పరింజా - సంయుక్త హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు కొత్త కుర్రాడు శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నాడు.