Begin typing your search above and press return to search.

నిఖిల్ రేంజే మారిపోయిందిగా..

By:  Tupaki Desk   |   6 Jan 2017 7:14 AM GMT
నిఖిల్ రేంజే మారిపోయిందిగా..
X
సక్సెస్ అందుకోవడం కంటే దాన్ని నిలబెట్టుకోవడం కీలకం. యువ కథానాయకుడు నిఖిల్ అదే చేస్తున్నాడు. ‘స్వామిరారా’ దగ్గర్నుంచి జాగ్రత్తగా అడుగులేస్తూ తన స్థాయి పెంచుకుంటూ వెళ్తున్నాడు. ఇటీవలే విడుదలైన ‘ఎక్కడికిపోతావు చిన్నవాడా’ పెద్ద సినిమాల స్థాయిలో వసూళ్ల వర్షం కురిపించింది. డీమానిటైజేషన్ దెబ్బకు జనాలు థియేటర్ల వైపే చూడని పరిస్థితుల్లో అనహ్యమైన వసూళ్లు సాధించింది. దీంతో నిఖిల్ ఫ్యూచర్ ప్రాజెక్టులకు బాగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా ఆసక్తికర ఫస్ట్ లుక్ పోస్టర్లతో జనాల్లో క్యూరియాసిటీ పెంచిన ‘కేశవ’కు ట్రేడ్ వర్గాల్లో ఇప్పటికే మంచి డిమాండ్ వచ్చింది. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కోసం ఫ్యాన్సీ రేట్లు వస్తున్నాయి.

‘కేశవ’ నైజాం హక్కులు ఇప్పటికే అనూహ్యమైన ధర పలికాయి. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్ ‘కేశవ’ హక్కుల్ని రూ.4 కోట్లకు కొన్నట్లు సమాచారం. నిఖిల్ స్థాయి హీరోకిది అనూహ్యమైన ధరే. ఈ లెక్కన సినిమా బిజినెస్ రూ.20 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశముంది. ‘కేశవ’ అభిషేక్ పిక్చర్స్ బేనర్లో తెరకెక్కుతున్న తొలి సినిమా. ఈ సంస్థ అధినేత అభిషేక్ ఇంతకుముందు సునీల్ నారంగ్ తో కలిసి సినిమాలు పంపిణీ చేశాడు. ఆ పరిచయం.. ‘కేశవ’ కథ గురించి అవగాహన కూడా ఉండటంతో ఫ్యాన్సీ రేటు ఇచ్చి సినిమాను కొన్నట్లు అభిషేక్ తెలిపాడు. మిగతా ఏరియాల నుంచి కూడా మంచి మంచి ఆఫర్లు వస్తున్నాయని.. త్వరలోనే బిజినెస్ క్లోజ్ అవుతుందని అభిషేక్ తెలిపాడు. ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కేశవ’ మార్చిలో ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఈ చిత్రంలో నిఖిల్ సరసన రీతువర్మ కథానాయికగా నటించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/