Begin typing your search above and press return to search.

కార్తికేయ హిట్ ఆ సినిమాకు కలిసి వచ్చింది

By:  Tupaki Desk   |   21 Aug 2022 5:35 AM GMT
కార్తికేయ హిట్ ఆ సినిమాకు కలిసి వచ్చింది
X
నిఖిల్‌ హీరోగా నటించిన కార్తికేయ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కార్తికేయ సినిమా కి సీక్వెల్‌ గా రూపొందిన ఈ సినిమా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి వసూళ్లను నమోదు చేసింది. మొదటి వారం రోజులు పూర్త అయిన తర్వాత కూడా సినిమా భారీగా షేర్ ను రాబడుతూ దూసుకు పోతుంది. ఈ సమయంలో 18 పేజెస్ సినిమా యూనిట్ సభ్యులు ఫుల్ ఖుషిగా ఉన్నారు.

కార్తికేయ 2 సినిమా సక్సెస్ అవ్వడంతో అదే సినిమా హీరో నిఖిల్ నటించిన 18 పేజెస్‌ సినిమా మంచి బజ్‌ ను క్రియేట్‌ చేస్తోంది. గీతా ఆర్ట్స్ 2 లో బన్నీ వాసు నిర్మించిన 18 పేజెస్‌ సినిమా ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కాని ఏవో కారణాల వల్ల సినిమా ను వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వచ్చారు.

ఇప్పుడు కార్తికేయ 2 సినిమా సూపర్‌ హిట్ అయిన నేపథ్యంలో 18 పేజెస్ కి మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కార్తికేయ 2 సినిమా కి ముందు విడుదల అయ్యి ఉంటే కచ్చితంగా 18 పేజెస్ సినిమాకి పెద్దగా బజ్ క్రియేట్‌ అయ్యేది కాదు. కాని తాజాగా సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేసేందుకు గాను బయ్యర్లు ముందుకు వస్తున్నారట.

కార్తికేయ 2 సినిమా లో నిఖిల్ మరియు అనుపమ పరమేశ్వరన్ లు జంటగా నటించిన విషయం తెల్సిందే. ఇదే జంట 18 పేజెస్ సినిమాలో కూడా నటించడం వల్ల సహజంగానే కార్తికేయ 2 సెంటిమెంట్ ఆ సినిమాకు కూడా వర్కౌట్‌ అవుతుంది అనే అభిప్రాయంతో అంతా ఉన్నారు. కార్తికేయ 2 సినిమా హిట్ కొట్టిన నేపథ్యంలో 18 పేజెస్‌ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఉన్నారు. అందుకే అతి త్వరలోనే 18 పేజెస్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.