Begin typing your search above and press return to search.

పాన్ ఇండియా రేస్ కు నిఖిల్ కూడా సై

By:  Tupaki Desk   |   17 April 2022 6:10 AM GMT
పాన్ ఇండియా రేస్ కు నిఖిల్ కూడా సై
X
టాలీవుడ్ లో పాన్ ఇండియా చిత్రాల హ‌వా మొద‌లైంది. ప్ర‌తీ హీరో ఇప్ప‌డు పాన్ ఇండియాని టార్గెట్ చేస్తున్నాడు. ప్ర‌భాస్ నుంచి నాని వ‌రకు ప్ర‌తీ హీరో పాన్ ఇండియాపై క‌న్నేశారు. తాజాగా ఈ రేసులోకి యంగ్ హీరో నిఖిల్ కూడా చేర‌బోతున్నాడు. ప్ర‌స్తుతం చందూ మొండేటి డైరెక్ష‌న్ లో `కార్తికేయ 2` మూవీతో పాటు ప‌ల్నాటి సూర్య ప్ర‌తాప్ డైరెక్ష‌న్ లో `18 పేజీస్‌` చిత్రాల్లో న‌టిస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లో `18 పేజీస్‌` చిత్రీక‌ర‌ణ దాదాపుగా పూర్త‌యి రిలీజ్ కు రెడీ అవుతుంటే `కార్తికేయ 2` ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

ఇదిలా వుంటే తాజా నిఖిల్ మ‌రో చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అయితే ఈ మూవీతో నిఖిల్ పాన్ ఇండియా ని టార్గెట్ చేస్తుండ‌టం విశేషం. ఇప్ప‌టికే ఇండస్ట్రీలో వున్న స్టార్ హీరోలు పాన్ ఇండియా మూవీస్ తో రెడీ అవుతుంటే తాజాగా ఈ జాబితాలోకి నిఖిల్ కూడా చేరడానికి రెడీ అవుతున్నాడు.

ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాష‌ల్లో విడుద‌ల కాబోతోంది. ఈడీ ఎంట‌ర్ టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ పై రూపొందుతున్న ఈ చిత్రం ద్వారా `గూడ‌చారి, ఎవ‌రు, హిట్ వంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌కు ఎడిట‌ర్ గా వ‌ర్క్ చేసిన గ్యారీ బిహెచ్ దర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు.

ఈ చిత్రానికి `స్పై` అనే ప‌వ‌ర్ ఫుల్‌ టైటిల్ ని ఖ‌రారు చేస్తూ చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ఈ మూవీని ప్ర‌క‌టించింది. కె. రాజ‌శేఖ‌ర్ రెడ్డి అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ మూవీని తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా వైడ్ గా విడుద‌ల చేయ‌బోతున్నారు. హీరో గా నిఖిల్ న‌టిస్తున్న 19వ చిత్ర‌మిది. విభిన్న‌మైన చిత్రాల‌ని ఎంచుకుంటూ హీరోగా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్న నిఖిల్ ఈ సినిమాపై పాన్ ఇండియా ఇమేజ్ ని టార్గెట్ చేయ‌డం విశేషం.

నిఖిల్ ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో స్పైగా న‌టిస్తున్న ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ టైటిల్ పోస్ట‌ర్ ని తాజాగా విడుద‌ల చేశారు. బుల్లెట్ లు ఆకాశం నుంచి నేల‌కు ఫోర్స్ గా వ‌స్తుంటే వాటి మ‌ధ్య‌లో టెర్రిఫిక్ లుక్ లో బ్లాక్ జాకెట్ ధ‌రించి..చేతిలో గ‌న్ తో నిఖిల్ న‌డిచి వ‌స్తున్న తీరు టెర్రిఫిక్ గా వుంది. సూప‌ర్ స్టైలిష్ స్పైగా నిఖిల్ ఈ చిత్రంలో క‌నిపించ‌బోతున్న‌ట్టుగా టైటిల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తో స్ప‌ష్ట‌మ‌వుతోంది. దీంతో అప్పుడే సినిమా పై మంచి బ‌జ్ మొద‌లైంది.

నిఖిల్ న‌టిస్తున్న ఫ‌స్ట్ పాన్ ఇండియా స్పై థ్రిల్ల‌ర్ మూవీ ఇది. ఇందులో చాలా కొత్త‌గా అత‌ని పాత్ర‌ని డిజైన్ చేసిన‌ట్టుగా క‌నిపిస్తోంది. యాక్ష‌న్ ప్యాక్డ్ స్పై థ్రిల్ల‌ర్ గా రూపొంద‌నున్న ఈ మూవీని పాన్ ఇండియా వైడ్ గా తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో ద‌స‌రా కు విడుద‌ల చేస్తున్న‌ట్టుగా చిత్ర బృందం ముందే ప్ర‌క‌టించ‌డం విశేషం.

ఐశ్వ‌ర్యా మీన‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌, స్టంట్ మాస్ట‌ర్స్ వ‌ర్క్ చేయ‌నున్నారు. అభిన‌వ్ గోమ‌ఠం, సాన్యా ఠాకూర్‌, జిస్సుసేన్ గుప్తా, నితిన్ మెమ‌తా, ర‌వివ‌ర్మ త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం, ర‌చ‌న అనిరుధ్ కృష్ణ‌మూర్తి, కెమెరా జూలియ‌న్ అమ‌రున్ ఏస్ట్ర‌డా, అర్జున్ సురిశెట్టి, కాస్ట్యూమ్స్ రంగారెడ్డి, అఖిల దాస‌రి, సుజీత్ కృష్ణ‌న్‌. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వి ఆంటోని.