Begin typing your search above and press return to search.

పార్కులో జరిగిన దాడి పై కంప్లైంట్ చేసిన నిఖిల్ హీరోయిన్...!

By:  Tupaki Desk   |   6 Sep 2020 11:50 AM GMT
పార్కులో జరిగిన దాడి పై కంప్లైంట్ చేసిన నిఖిల్ హీరోయిన్...!
X
నిఖిల్‌ హీరోగా నటించిన 'కిర్రాక్ పార్టీ' సినిమాతో పాటు ప‌లు కన్నడ త‌మిళ చిత్రాల్లో న‌టించిన హీరోయిన్ సంయుక్త హెగ్డే పై ఇటీవల దాడి జరిగిన సంగతి తెలిసిందే. బెంగ‌ళూరులోని ఓ పార్కులో డాన్స్‌ మరియు వర్కౌట్స్ చేయ‌డానికి తన స్నేహితులతో క‌లిసి వచ్చిన సంయుక్త పై అదే స‌మయంలో అక్క‌డున్న‌ క‌వితా రెడ్డి అనే మహిళా వ్యాపారవేత్త దాడి చేసింది. స్పోర్ట్స్ బ్రా ధరించిన సంయుక్త ని 'ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకున్నావ్ అంటూ విమర్శిస్తూ దాడి చేసింది. సరిగ్గా బుద్ధి చెప్పావంటూ అక్కడ స్థానికంగా ఉన్న ప‌బ్లిక్ కూడా ఆమెకు వత్తాసు పలికారు. పబ్లిక్ లో స్పోర్ట్స్ బ్రా వేసుకుని తిర‌గ‌డంతో పాటు మీ ఆర్టిస్టులంద‌రూ డ్ర‌గ్స్ వాడుతారంటూ విమర్శించారు. ఊహించని ఈ ఘ‌ట‌న‌తో షాక్‌ కు గురైన సంయుక్త‌.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా జ‌రిగిన విష‌యాన్ని తెలియ‌జేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది.

అయితే ఇప్పుడు హీరోయిన్ సంయుక్త హెగ్డే తనపై దాడి చేసిన మహిళా వ్యాపారవేత్త క‌వితా రెడ్డి పై కంప్లైంట్ చేసినట్లు తెలుస్తోంది. త‌న‌ పై జ‌రిగిన దాడికి సంబంధించిన వీడియోని ఆధారంగా చూపిస్తూ ఆమె పై న్యాయ పరంగా చర్యలు తీసుకునేలా చేయాలని నిర్ణయించుకుంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంయుక్త హెగ్డే పై జరిగిన దాడి వీడియోపై స్పందిస్తూ పలువురు సినీ ప్రముఖులు సామాజిక మహిళా కార్యకర్తలు సంయుక్త కి మద్ధతు తెలుపుతున్నారు. స్త్రీ వస్త్ర ధారణపై కామెంట్స్ చేస్తూ దాడి చేయడాన్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు క‌వితా రెడ్డి పొట్టి నిక్కరు ధరించి జాగింగ్ చేస్తున్న ఓ ఫోటోని సోషల్ మీడియాలో సర్క్యూలేట్ చేస్తూ నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.