Begin typing your search above and press return to search.

సురేందరే కాదు.. పూరి కూడా

By:  Tupaki Desk   |   12 Oct 2016 9:30 AM GMT
సురేందరే కాదు.. పూరి కూడా
X
ఓ కన్నడ సినిమాకు రూ.75 కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. ఇది శాండిల్ వుడ్లోనే రికార్డు. అందులోనూ ఓ కొత్త హీరోకు అంత ఖర్చా అని అంతా ఆశ్చర్యపోయారు. కానీ తాత మాజీ ప్రధాన మంత్రి.. తండ్రి మాజీ ముఖ్యమంత్రి.. ఇలాంటి బ్యాగ్రౌండ్ ఉన్న హీరోకు ఆ మాత్రం ఖర్చన్నది పెద్ద విషయం కాదు. ఐతే కేవలం తొలి సినిమా వరకే ఈ హడావుడి అయిపోవట్లేదు. నిఖిల్ గౌడ రెండో సినిమాకు కూడా భారీ ప్రణాళికలే ఉన్నాయి. దీనికి కూడా టాలీవుడ్ టెక్నీషియన్లనే నమ్ముకుంటున్నారు నిఖిల్-కుమారస్వామి. దర్శకుడిగా సురేందర్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లుగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే.

ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ సురేందర్ తో పాటు ఇంకో అగ్ర దర్శకుడి పేరు కూడా చెప్పాడు నిఖిల్. తన రెండో సినిమా కోసం సురేందర్ రెడ్డితో పాటు పూరి జగన్నాథ్ తో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు నిఖిల్ వెల్లడించాడు. తుది నిర్ణయం తన తండ్రే తీసుకుంటాడని.. తన కథలన్నీ ఆయనే సెలక్ట్ చేస్తారని.. డిసెంబర్లో తన రెండో సినిమా ప్రకటన ఉంటుందని వెల్లడించాడు జాగ్వార్ హీరో. ‘జాగ్వార్’లో 90 శాతం తెలుగు నటీనటులే ఉంటారని.. ఈ సినిమాకు తెలుగులో చక్కటి ఆదరణ లభించిందని.. ఇకపైనా కన్నడ-తెలుగు భాషల్లో ఒకేసారి సినిమా చేస్తానని నిఖిల్ తెలిపాడు. అసలు నిఖిల్ ను పూరి చేతుల మీదుగానే హీరోగా పరిచయం చేయాలని భావించాడు కుమారస్వామి. ఎందుకో కుదర్లేదు. మరి రెండో సినిమాకైనా పూరిని సెట్ చేస్తారేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/