Begin typing your search above and press return to search.

తండ్రి కాబోతున్న యువ హీరో

By:  Tupaki Desk   |   22 Jun 2021 10:00 PM IST
తండ్రి కాబోతున్న యువ హీరో
X
శాండ‌ల్ వుడ్ హీరో నిఖిల్ గౌడ వ్య‌క్తిగ‌త జీవితంలో మ‌రో ఆనందం రాబోతోంది. త్వ‌ర‌లో ఆయ‌న తండ్రి కాబోతున్నారు. జాగ్వార్ సినిమాతో వెండి తెర‌కు ప‌రిచ‌య‌మైన నిఖిల్‌.. ఆ త‌ర్వాత ప‌లు చిత్రాల్లో న‌టించారు. గ‌తేడాది ఏప్రిల్ లో వివాహం చేసుకున్న ఆయ‌న‌.. త్వ‌ర‌లో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు.

ప్ర‌స్తుతం ఆయ‌న భార్య రేవ‌తి ఐదు నెల‌ల గ‌ర్భ‌వ‌తి. ఇటీవ‌లే ఆమె పుట్టిన రోజు వేళ సోష‌ల్ మీడియా ద్వారా విషెస్ తెలియ‌జేసిన నిఖిల్‌.. ప‌రోక్షంగా ఆమె ప్రెగ్నెంట్ అన్న విష‌యం కూడా తెలియ‌జేశారు. దీంతో.. ఈ జంట‌కు సామాజిక మాధ్య‌మాల్లో శుభాకాంక్ష‌లు చెబుతున్నారు అభిమానులు.

నిఖిల్ గౌడ సినీ హీరో మాత్ర‌మే కాకుండా.. పొలిటిక‌ల్ గా కూడా బ‌ల‌మైన బ్యాగ్రౌండ్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న తండ్రి కుమార స్వామి మాజీ ముఖ్య‌మంత్రి కాగా.. నిఖిల్ తాత దేవెగౌడ ప్ర‌ధానిగా ప‌నిచేశారు. నిఖిల్ మామ రేవ‌న్న కూడా బ‌ల‌మైన రాజ‌కీయ నాయ‌కుడే.

సినిమాల్లో హీరోగా చేసిన నిఖిల్ గ‌త ఎన్నిక‌ల్లో రాజ‌కీయాల్లోకి సైతం దిగారు. పొలిటిక‌ల్ వార‌స‌త్వాన్ని కొన‌సాగిస్తూ.. మాండ్యా నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగారు. కానీ.. విజ‌యం సాధించ‌లేక‌పోయారు. ప్ర‌స్తుతం క‌రోనా, లాక్ డౌన్ వేళ ఇంటి ప‌ట్టునే ఉంటున్న నిఖిల్‌.. రాబోయే వార‌సుడి కోసం ఎన్నో క‌ల‌లు కంటున్నారు.