Begin typing your search above and press return to search.

రారండోయ్.. కన్నడ రీమేక్ ఎవరితో తెలుసా?

By:  Tupaki Desk   |   30 Nov 2017 2:30 AM GMT
రారండోయ్.. కన్నడ రీమేక్ ఎవరితో తెలుసా?
X
ఈ ఏడాది తెలుగులో మంచి విజయం సాధించిన సినిమాల్లో ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఒకటి. అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఆయన పెద్ద కొడుకు నాగచైతన్య-రకుల్ ప్రీత్ జంటగా కళ్యాణ్ కృష్ణ రూపొందించిన ఈ చిత్రం సూపర్ హిట్టయింది. ఈ చిత్రం ఇప్పుడు కన్నడలోకి రీమేక్ అవుతుండటం విశేషం. తెలుగులో హిట్టయిన ప్రతి సినిమానూ కన్నడలో రీమేక్ చేయడం మామూలే కాబట్టి ఈ రీమేక్ కూడా ఆశ్చర్యం కలిగించే విషయమేమీ కాదు. ఐతే ఈ రీమేక్ లో నటిస్తున్న హీరో ఎవరో తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోవాల్సిందే.

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ ‘రారండోయ్..’ కన్నడ రీమేక్ లో కథానాయికుడిగా నటిస్తుండటం విశేషం. అతడి తండ్రే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి ‘సీతారామ కళ్యాణం’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. నిఖిల్ గత ఏడాది రూ.75 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘జాగ్వార్’ సినిమాతో కథానాయకుడిగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తెలుగులోనూ రిలీజైంది. కన్నడతో పాటు తెలుగులోనూ ఫ్లాప్ అయింది. తొలి సినిమాతో యాక్షన్ హీరో అయిపోదామని చూసిన నిఖిల్ కు ఎదురు దెబ్బ తగిలేసరికి.. తర్వాత నుంచి మీడియం రేంజిలో మామూలు సినిమాలు ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ అతడి రెండో సినిమా సెట్స్ మీద ఉండగా.. తొలిసారి రీమేక్ లో నటించడానికి అతను రెడీ అయ్యాడు. మరి ఈ సినిమా అతడికెలాంటి ఫలితాన్నందిస్తుందో చూడాలి.