Begin typing your search above and press return to search.

మెగా హీరో కథకి నిఖిల్ గ్రీన్ సిగ్నల్!

By:  Tupaki Desk   |   8 March 2021 7:18 PM IST
మెగా హీరో కథకి నిఖిల్ గ్రీన్ సిగ్నల్!
X
తెరపైనే కాదు .. బయట కూడా నిఖిల్ చాలా యాక్టివ్ గా ఉంటాడు. కుర్ర దర్శకులను కలుపుకుని .. కొత్త నిర్మాతలను పట్టుకుని ప్రాజెక్టులను పట్టాలెక్కించడంలో నిఖిల్ ముందు ఉంటాడు. ఎప్పటికప్పుడు వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. బన్నీ వాసు నిర్మాణంలో '18 పేజెస్' చేస్తున్నాడు. కొత్త కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాలో నిఖిల్ జోడీగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది.

ఇక 'కార్తికేయ 2' కూడా సెట్స్ పైనే ఉంది. చందూ మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'కార్తికేయ'కు ఇది సీక్వెల్.గతంలో 'సుబ్రమణ్యస్వామి' ఆలయం చుట్టూ తిరిగిన కథ, ఇప్పుడు ద్వాపరయుగం నాటి ఒక రహస్యం చుట్టూ తిరగనుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కూడా తప్పకుండా హిట్ అవుతుందనీ, తన కెరియర్లో చెప్పుకోదగిన సినిమా అవుతుందని నిఖిల్ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే నిఖిల్ మరో కొత్త కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.

మెడికల్ పరంగా సాగే మోసాలు .. ఆ వెనుక విస్తరించిన అవినీతి సామ్రాజ్యం గురించిన కథాకథనాలతో ఈ సినిమా నడుస్తుందని అంటున్నారు. కోన వెంకట్ రాసిన ఈ కథ ముందుగా సాయిధరమ్ తేజ్ దగ్గరికి వెళ్లిందట. కథ నచ్చినప్పటికీ .. సాయిధరమ్ తేజ్ ముందుగా కమిట్ అయిన ప్రాజెక్టులు పూర్తయితేనే తప్ప, ఈ సినిమా చేసే అవకాశం లేదు. అదే విషయం ఆయన చెప్పడంతో, ఈ కథ నిఖిల్ దగ్గరికి వచ్చిందట. కంటెంట్ కొత్తగా ఉండటంతో వెంటనే నిఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. దర్శక నిర్మాతలు ఎవరనే విషయంతో పాటు, ఇతర వివరాలు త్వరలో తెలియనున్నాయి.