Begin typing your search above and press return to search.

కుర్ర హీరో కూడా బైక్ గిఫ్టిచ్చాడుగా

By:  Tupaki Desk   |   5 March 2016 5:30 PM GMT
కుర్ర హీరో కూడా బైక్ గిఫ్టిచ్చాడుగా
X
తమ దగ్గర పని చేసే అసిస్టెంట్స్ కు, నచ్చినవాళ్లకి స్టార్ హీరోలు బహుమతులు ఇవ్వడం సహజమే కానీ.. ఈ మధ్య ఈ గిఫ్టులు బాగా కాస్ట్ లీగా ఉంటున్నాయి. అజిత్ తన అసిస్టెంట్స్ అందరికీ ఇళ్లు బహుమతిగా ఇస్తే.. టాలీవుడ్ లో మహేష్ బాబు లగ్జరీ కారు ఇచ్చాడు కొరటాలకి. ఇదే డైరెక్టర్ ఖరీదైన వాచ్ కొనిపెట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఇంత కాస్ట్లీ కాకపోయినా.. తన అసిస్టెంట్ కి మంచి గిఫ్టే ఇచ్చాడు కుర్ర హీరో నిఖిల్.

'ఈ అడ్వంచర్ స్పోర్ట్స్ బైక్ బాగా నచ్చింది. నా అసిస్టెంట్ నరసింహ కోసం ఇవాళే ఒకటి కొన్నాను' అంటూ తన సోషల్ పేజ్ లో పోస్ట్ చేశాడు నిఖిల్. అంతే కాదు.. ఆ బైక్ పై తాను కూర్చుని ఓ ఫోటో కూడా దిగాడీ హీరో. అఫ్ కోర్స్.. బైక్ రైడింగ్ చేస్తూ ఫోటో దిగలేదు కాబట్టి.. హెల్మెట్ ఏది లాంటి క్వశ్చన్స్ వేయద్దు లెండి. చక్కగా సెంటర్ స్టాండ్ పై పార్క్ చేసి ఉన్న రెడ్ కలర్ బైక్ పై స్టైల్ గా కూర్చుని పోజిచ్చాడు నిఖిల్. ఫోటో బాగుంది కానీ.. బైక్ స్టాండ్ తీసుంటే బాగుండేది నిఖిల్ అంటూ.. అభిమానులు సలహా ఇస్తున్నారు.

ఇదిలాఉంటే శంకరాభరణం ఫ్లాప్ నుంచి కోలుకున్న ఈ కుర్రహీరో.. ప్రస్తుతం వీఐ ఆనంద్ డైరెక్షన్ లో సినిమాని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసేస్తున్నాడు. షూటింగ్ పార్ట్ రెండు మూడు షెడ్యూల్స్ అయ్యాకే మిగిలిన డీటైల్స్ బయటకు చెబ్తాడట నిఖిల్.