Begin typing your search above and press return to search.

నితిన్ సినిమాతోనే నిఖిల్ ఫస్ట్ ఎంట్రీ!

By:  Tupaki Desk   |   1 Jun 2020 11:50 AM GMT
నితిన్ సినిమాతోనే నిఖిల్ ఫస్ట్ ఎంట్రీ!
X
'అర్జున్ సురవరం’ సినిమాతో హీరో నిఖిల్ మళ్లీ కంబ్యాక్ అయ్యాడు. అంతేగాక అదే జోష్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌‌లో ఛాన్స్ కొట్టేశాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌లో బన్నీ వాసు నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో హీరోగా క్రేజీ ఆఫర్ దక్కించుకున్నాడు నిఖిల్. ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కించనున్నాడు. సుకుమార్ రెండోసారి కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. ఇదివరకు సుకుమార్ కథతో దర్శకుడు పల్నాటి సూర్య ప్రతాప్ 'కుమార్ 21f' తెరకెక్కించి సంచలన విజయాన్ని నమోదు చేసాడు. మళ్లీ నాలుగేళ్ల తరువాత సుకుమార్-సూర్య ప్రతాప్ కాంబినేషన్ రిపీట్ అవుతుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు పెరిగాయి. దీనికి తోడు గీతా ఆర్ట్స్‌ ద్వారా అల్లు అరవింద్ భాగస్వామ్యం కావడం.. అర్జున్ సురవరంతో హిట్ అందుకున్న నిఖిల్ హీరోగా నటిస్తుండటంతో.. అధికారిక ప్రకటన కూడా రాకముందే సినిమా పై క్రేజ్ పెరిగింది.

ఇక 'హ్యాపీ డేస్' సినిమా ఇచ్చిన ఫాలోయింగ్ తో ఇప్పటికీ హీరో హీరోయిన్లుగా ఎవరైనా రాణిస్తున్నారంటే అది కేవలం తమన్నా.. నిఖిల్ మాత్రమే. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'హ్యాపీ డేస్' సినిమాలో నిఖిల్ పోషించిన రాజేష్ పాత్ర యూత్ ను విశేషంగ్స్ ఆకట్టుకుంది. అయితే అందరూ.. అదే నిఖిల్ మొదటి సినిమా అని అనుకుంటున్నారు. కానీ అంతకు ముందే నిఖిల్ ఓ యంగ్ హీరో సినిమాలో నటించాడు. ఆ క్రేజీ హీరో ఎవరు.. అసలు విషయం ఏంటంటే.. డైరెక్టర్ దశరథ్.. నితిన్ హీరోగా 'సంబరం' అనే సినిమాను తెరకెక్కించాడు. దర్శకుడు తేజ ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. అయితే ఇదే నిఖిల్ కు మొదటి చిత్రం. ఓ సన్నివేశంలో ఇలా వచ్చి.. అలా వెళ్ళిపోయే పాత్రలో నిఖిల్ కనిపించాడు. క్రింద మీరు చూస్తున్న ఫోటో ఆ చిత్రంలోనిదే. ఈరోజు నిఖిల్ పుట్టినరోజు కావడంతో ఈ ఫోటో వైరల్ గా మారింది. ఇక పెళ్ళైన తరువాత నిఖిల్ కు ఇదే మొదటి పుట్టినరోజు కావడం కూడా మరో విశేషం. తుపాకీ మీడియా తరపున హీరో నిఖిల్ కి శుభాకాంక్షలు!