Begin typing your search above and press return to search.

అప్పుడు షేక్ హ్యాండ్‌, ఇప్పుడు హ‌గ్గు

By:  Tupaki Desk   |   17 Oct 2015 7:30 AM GMT
అప్పుడు షేక్ హ్యాండ్‌, ఇప్పుడు హ‌గ్గు
X
అప్‌ క‌మింగ్ హీరోల్లో స్టార్ హీరో అయ్యే ల‌క్ష‌ణాలు ఒక్క నికిల్‌ లోనే క‌నిపిస్తున్నాయి. ఇమేజ్ చ‌ట్రంలో ఇరుక్కోకుండా తెలివైన ప్ర‌ణాళిక‌ల‌తో తెలివిగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాడు. వ‌రుస‌గా ప్ర‌యోగాత్మ‌క క‌థ‌ల్ని ఎంచుకుని క‌మ‌ర్షియ‌ల్ విజయాల్ని అందుకోవ‌డం ఎలానూ ప్రూఫ్ ఇచ్చాడు నిఖిల్‌. అందుకే ఇప్పుడు అంద‌రికళ్లు అత‌డిపైనే ఉన్నాయి. ఇప్పుడు మ‌రో ప్ర‌యోగాత్మ‌క చిత్రం శంక‌రాభ‌ర‌ణంతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నాడు. స్టార్ రైట‌ర్ కం ప్రొడ్యూస‌ర్ కోన వెంక‌ట్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌లే ప‌వ‌ర్‌ స్టార్ ప‌వ‌న్‌ క‌ల్యాణ్ చేతుల‌మీదుగా ఈ సినిమా టీజ‌ర్‌ ని ఆవిష్క‌రించారు. ఆ సంద‌ర్భంలో నిఖిల్‌ లోని ఉత్సాహం పీక్స్‌ లో క‌నిపించింది.

ప‌వ‌ర్‌ స్టార్ ఇలా నా సినిమా టీజ‌ర్ ఆవిష్క‌రించ‌డం సినిమాకి పెద్ద అస్సెట్‌. ప‌వ‌న్ ఎంద‌రికో ఇన్‌ స్పిరేష‌న్‌. యంగ్ స్టార్స్‌ ని ఎంక‌రేజ్ చేసే హీరోగా ఆయ‌న వ్య‌క్తిత్వం అంటే ఇష్టం. అపుడెపుడో ఓ ఆడియో వేదిక‌పై ఓ షేక్ హ్యాండ్ తీసుకున్నా. ఇప్పుడిలా ఏకంగా నా సినిమా టీజ‌ర్ సంద‌ర్భంగా త‌న‌తో క‌లిసి ముచ్చ‌టించే ఛాన్సొచ్చింది. ఇవి అరుదైన క్ష‌ణాలు. ఎంతో సంతోషంగా ఉంది. ఎన్నో సంగ‌తుల్ని ముచ్చ‌టించుకున్నాం. శంక‌రాభ‌ర‌ణం టీజ‌ర్‌ ని మూడు సార్లు చూశారాయ‌న‌. నా సినిమా కార్తికేయ గురించి కూడా ప్ర‌త్యేకంగా అడిగారు.. అంటూ చెప్పుకొచ్చాడు నిఖిల్‌. ప‌వ‌న్ షేక్‌ హ్యాండుతో ల‌క్ష‌ల్లో పారితోషికం కోట్ల‌లోకి పాకింది. ఇప్పుడు హ‌గ్గిచ్చాడు కాబ‌ట్టి మునుముందు అది ఎంత‌కైనా వెళుతుందేమో గురూ?