Begin typing your search above and press return to search.

నిఖిల్ కొత్త సినిమా వచ్చేస్తోంది

By:  Tupaki Desk   |   5 Sept 2016 10:46 PM IST
నిఖిల్ కొత్త సినిమా వచ్చేస్తోంది
X
ఎక్కడికి పోతావు చిన్నవాడా.. అంటూ ఓ పాత పాటను తలపించే టైటిల్ పెట్టుకున్నాడు నిఖిల్. ఆ మధ్య ఒక ఆసక్తికరమైన పోస్టర్ రిలీజ్ చేసి.. టాలీవుడ్ లో పెద్ద చర్చకు తెరతీసిన నిఖిల్.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయాడు. దీంతో అందరూ ఎక్కడికి పోయాడు ఈ కుర్రాడు అనుకున్నారు. ఐతే నిఖిల్ ఎక్కడికీ పోలేదు.. సైలెంటుగా షూటింగ్ చేసుకుంటున్నాడు. సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. సెప్టెంబరు 12 కల్లా టాకీ పార్ట్ పూర్తయిపోతుందట. ప్రస్తుతం కర్ణాటకలోని చిక్ మంగళాపూర్ లో ఈ చిత్ర యూనిట్ బిజీగా షూటింగ్ చేసుకుంటోంది. ఆ షెడ్యూల్ అవ్వగానే పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలవుతాయి.

‘టైగర్’ ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మేఘన క్రియేషన్స్ అనే కొత్త నిర్మాణ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది. ఇంతకుముందు ఆనంద్.. తమిళంలో ‘అప్పూచి గ్రామం’ అనే సైన్స్ ఫిక్షన్ తీసి మెప్పించాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ కూడా ఆ తరహా సినిమానే. ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తేనే ఆ విషయం అర్థమైంది. ‘కార్తికేయ’ తర్వాత తనకు ఇది మరో మంచి ప్రయోగం అవుతుందని భావిస్తున్నాడు నిఖిల్. అతడి సరసన హెబ్బా పటేల్.. నందిత శ్వేత నటిస్తున్నారు. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తారు. ఈ నెలాఖరులో ఆడియో విడుదలవుతుంది. అక్టోబర్ లోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేబోతున్నారు.