Begin typing your search above and press return to search.

ఎక్స్ క్లూజివ్: కార్తికేయ 2 నిఖిల్ క్యారెక్టర్

By:  Tupaki Desk   |   1 Jun 2020 8:30 AM GMT
ఎక్స్ క్లూజివ్: కార్తికేయ 2 నిఖిల్ క్యారెక్టర్
X
హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఈరోజు తన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈమధ్యే డాక్టర్ పల్లవి వర్మను వివాహమాడి నిఖిల్ తన సింగిల్ స్టేటస్ కు బైబై చెప్పిన సంగతి తెలిసిందే. ఇక నిఖిల్ పుట్టిన రోజు సందర్భంగా అటు ఇండస్ట్రీ ఫ్రెండ్స్.. ఇటు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

నిఖిల్ ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'కార్తికేయ-2' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 2014 లో సూపర్ హిట్ అయిన 'కార్తికేయ'కు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతోంది. మొదటి భాగం చూసినవారికి ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలను అందుకునేలా ఈ సినిమాను చందు ప్లాన్ చేస్తున్నాడట. ఇక ఈ సినిమాలో నిఖిల్ పాత్ర గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో నిఖిల్ ఓ డాక్టర్ పాత్రలో నటిస్తున్నాడట.

ఒరిజినల్ లో కార్తికేయ ఒక మెడికల్ స్టూడెంట్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డాక్టర్ అవతారంలో కనిపిస్తాడన్నమాట. 'కార్తికేయ 2' కాన్సెప్ట్ టీజర్ లో సినిమా థీమ్ వెల్లడించిన విషయం తెలిసిందే. ద్వాపర యుగాంతంలో మరుగుపడిపోయిన ఒక రహస్యం.. ఆ సీక్రెట్ కోసం కలియుగంలో కొందరు ప్రయత్నించడం అనేది ఆసక్తికరం.