Begin typing your search above and press return to search.

చాన్నాళ్ళకు చిందేసిన యువహీరో

By:  Tupaki Desk   |   29 July 2015 5:11 PM IST
చాన్నాళ్ళకు చిందేసిన యువహీరో
X
యువ హీరో నిఖిల్ కెరీర్ ఆరంభంలో మరో రవితేజ అని అందరూ అన్నారు. అల్లరి చిల్లరి వేషాలతో రవితేజను తలపించే స్టెప్పులతో ఆ పేరుకి సార్థకత చేకూర్చిన నిఖిల్ వరుసగా విభిన్న కథలతో సినిమాలు చేయడంతో ఆ పేరు దూరమయింది. దీంతో పాటు ఆ డాన్సులు దూరమయ్యాయి. ఈ మూడు సినిమాల కథల మూలంగా డాన్స్ కి అవకాశమే లేకుండా పోయింది. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత నిఖిల్ చిందేశాడు.

క్రైమ్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతున్న శంకరాభరణం నటుస్తున్న నిఖిల్ పై ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నేతృత్వంలో రామోజీ ఫిల్మ్ సిటీ లో ఓ పాటను షూట్ చేశారు. అందులోదే ఈ ఫోటో. చూస్తుంటే ఈ పాటలో నిఖిల్ తన డాన్స్ ముచ్చట తీర్చుకున్నట్టే వున్నాడు. నందిత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ బీహార్ లో జరుగగా, రెండో షెడ్యూల్ అమెరికాలో జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో. ఈ వేగానికి కారణం రచయిత కోన వెంకటే. కథ, స్క్రీన్ ప్లే తో పాటు సమర్పకుడిగా వున్న ఈ సినిమాని దసరా కి తెర మీదికి తీసుకురావాలన్నది ఆయన ప్లాన్.