Begin typing your search above and press return to search.
అర్జున్ సురవరం .. జర్నలిస్ట్ పవర్!
By: Tupaki Desk | 2 March 2019 4:31 PM GMTజర్నలిస్ట్ డ్యాషింగ్ యాటిట్యూడ్ ని, పవర్ ప్యాక్డ్ షోని ఎలివేట్ చేస్తూ గతంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే వాటన్నిటికంటే `అర్జున్ సురవరం` ఎలా డిఫరెంట్? .. ప్రస్తుతం టాలీవుడ్ సర్కిల్స్ ని వేడెక్కిస్తున్న హాట్ టాపిక్ ఇది. ప్రయోగాల హీరో .. పెర్ఫెక్షనిస్ట్ నిఖిల్ ఏదో ప్రయోగం చేస్తున్నాడు. ఈసారి మునుపటి కంటే కొత్తగా కనిపిస్తాడని అభిమానులు ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. `ముద్ర` టైటిల్ వివాదం అనంతరం `అర్జున్ సురవరం` గా మారింది. టైటిల్ స్ట్రైకింగ్ గా ఉందన్న ప్రశంసలు దక్కాయి. పక్కింటి అబ్బాయి పేరులా.. జనంలోకి టైటిల్ దూకుడుగానే దూసుకెళ్లింది. సినిమాలో నిఖిల్ పాత్ర పేరునే టైటిల్ గా నిర్ణయించారు. `లవర్స్ డే` కానుకగా రిలీజ్ చేసిన పోస్టర్లు ఆకట్టుకున్నాయి.
తాజాగా అర్జున్ సురవరం కొత్త అప్ డేట్ వచ్చింది. మహాశివరాత్రి కానుకగా ఈనెల 4న 5 పీఎం `అర్జున్ సురవరం` టీజర్ ని రిలీజ్ చేయనున్నారు. టీజర్ డేట్ పోస్టర్ ఆకట్టుకుంది. నిఖిల్ ఓ సీరియస్ జర్నలిస్టుగా ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిజమ్ పవర్ ని సత్తాని నిఖిల్ పాత్ర రూపంలో ఎలివేట్ చేస్తున్నారా? అన్న ఆసక్తి కలిగింది. ఈ చిత్రానికి టీఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్నారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ హిట్ మూవీ `కణితన్`కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. స్యామ్ సిఎస్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఔరా సినిమాస్ పివిటి, మూవీ డైనమిక్స్ ఎల్ఎల్‌పి బ్యానర్స్‌పై కావ్య వేణుగోపాల్, రాజు కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి మధు సమర్పిస్తున్నారు.