Begin typing your search above and press return to search.

రిలీజ్ మ‌ళ్లీ మారింది..సారి చెప్పిన హీరో!

By:  Tupaki Desk   |   12 July 2022 8:30 AM GMT
రిలీజ్ మ‌ళ్లీ మారింది..సారి చెప్పిన హీరో!
X
క‌రోరా కార‌ణంగా చాలా వ‌ర‌కు సినిమాల షూటింగ్ లు వాయిదా ప‌డుతూ వ‌చ్చాయి. ఆ త‌రువాత ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డ‌టంతో నిర‌వ‌ధిక షూటింగ్ లు మ‌ళ్లీ య‌ధ‌విధిగా మొద‌ల‌య్యాయి. అయితే స‌కాలంలో షూటింగ్ లు పూర్త‌వుతున్నా కొన్ని క్రేజీ సినిమాలు మాత్రం రిలీజ్ డేట్ ల‌ని అనివార్య కార‌ణాల వ‌ల్ల వాయిదా వేస్తూ కొత్త రిలీజ్ డేట్ ల‌ని ప్ర‌క‌టిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో యంగ్ హీరో నిఖిల్ సినిమా రిలీజ్ డేట్ మ‌ళ్లీ మారింది. దీంతో ఫ్యాన్స్ కి, ప్రేక్ష‌కుల‌కు సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ వేదిక‌గా హీరో నిఖిల్ సారీ చెప్పారు.

వివ‌రాల్లోకి వెళితే.. హీరో నిఖిల్ న‌టిస్తున్న సూప‌ర్ నేచుర‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ 'కార్తికేయ -2'. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ చందూ మొండేటి ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నాయి. బాలీవుడ్ పాపుల‌ర్‌ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ అనుప‌మ్ ఖేర్ న‌టిస్తున్న తొలి తెలుగు చిత్ర‌మిది.

2014లో వ‌చ్చిన 'కార్తికేయ‌' చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమాని తెర‌కెక్కించారు. నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందుతున్న చిత్రిమ‌ది.

అలాగే నిఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల‌లో పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాని రిలీజ్ చేయ‌బోతున్నారు. జూలై 22న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ మ‌రోసారి మారింది.

ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ట్విట్టర్ వేదిక‌గా హీరో నిఖిల్ వెల్ల‌డిస్తూ ప్రేక్ష‌కుల‌కు, అభిమానుల‌కు సారీ చెప్పారు. జూలై 22న ఈ మూవీ రిలీజ్ కావ‌డం లేద‌ని, ఆగ‌స్టు ఫ‌స్ట్ వీక్ లో రిలీజ్ చేస్తున్నామ‌ని, ప్రీమియ‌ర్ షోల కోసం టికెట్ లు బుక్ చేసుకున్న వారికి క్ష‌మాప‌ణ చెబుతున్నాన‌ని, మీ డ‌బ్బుల‌ని తిరిగి ఇప్పిస్తాన‌ని అన్నారు. దీంతో ఈ మూవీ మ‌రోసారి పోస్ట్ పోన్ అవుతుంది అంటూ వ‌స్తున్న వార్త‌ల‌కు క్లారిటీ ఇచ్చారు. ముందు ఈ మూవీని ఏప్రిల్ లో రిలీజ్ చేస్తున్నామంటూ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

కానీ అది కాస్తా జూలై 22 కు మారింది. ఇప్ప‌డు ఈ రిలీజ్ డేట్ కూడా మార‌డం, ప్రీమియ‌ర్ షోల కోసం అడ్వాన్ప్ బుకింగ్స్ లో టికెట్ ల‌ని కోనుగోలు చేసిన వారికి డ‌బ్బులు తిరిగి ఇస్తామంటూ హీరో నిఖిల్ ట్వీట్ చేయ‌డం గ‌మ‌నార్హం. త్వ‌ర‌లోనే ఈ మూవీ కొత్త‌ రిలీజ్ డేట్ ని వెల్ల‌డించ‌నున్నార‌ట‌. ఆదిత్య‌మీన‌న్, శ్రీ‌నివాస‌రెడ్డి, హ‌ర్ష చెముడు, తుల‌సి, ప్ర‌వీణ్‌, స‌త్య ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.