Begin typing your search above and press return to search.

ఉగాది గెటప్ లో కిర్రాక్ పార్టీ

By:  Tupaki Desk   |   16 March 2018 10:02 AM IST
ఉగాది గెటప్ లో కిర్రాక్ పార్టీ
X
ఉగాది తెలుగు వారింట తొలి పండగ. మామిడాకు తోరణాలు.. వసంత సమయాన కోకిలలు ఆలపించే మధుర గీతికలు.. షడ్రచుల సమ్మేళనంగా ఉండే పచ్చళ్లు.. ఇంట బంధుజనం సందళ్లతో ప్రతి లోగిలి కళకళలాడుతుంది. అసలు సిసలైన ఈ తెలుగు పండగ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ యంగ్ హీరో నిఖిల్ తన లేటెస్ట్ మూవీ కిర్రాక్ పార్టీ ప్రమోషన్ చేస్తున్నాడు.

కిర్రాక్ పార్టీ మూవీ ఈ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. సంయుక్త హెగ్డే.. సిమ్రన్ పరింజా ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. వీళ్లిద్దరితో కలిసి తెలుగు సంప్రదాయం ఉట్టిపడే విధంగా నిఖిల్ ఈ మూవీ ప్రమోషన్ చేస్తున్నాడు. తెలుగుదనాన్ని గుర్తుచేసేలా పట్టుపంచె కట్టుకుని మరీ నిఖిల్ వస్తే... హీరోయిన్లు ఇద్దరూ నిండైన కట్టుబొట్టుతో వచ్చి సినిమా గురించిన విశేషాలు అందరితో పంచుకున్నారు. సినిమా రిలీజ్ రోజున వీళ్లు ప్రమోషన్ చేసిన తీరు పండగ మూడు రోజుల ముందే వచ్చిందని అనిపించింది.

ఈ ఉగాదికి థియేటర్లలో ఉండే పెద్ద సినిమా కిర్రాక్ పార్టీయే. కన్నడలో సూపర్ హిట్ అయిన ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి. వరస హిట్లతో జోరుమీదున్న యంగ్ హీరో నిఖిల్ చాలా రోజుల తరవాత రీమేక్ సబ్జెక్టుతో సినిమా చేశారు. కొత్త డైరెక్టర్ శరణ్ కొప్పిశెట్టి దీనికి డైరెక్టర్.