Begin typing your search above and press return to search.

స్వామిరారా కాంబినేషన్ స్ట్రైక్స్ బ్యాక్

By:  Tupaki Desk   |   28 July 2016 3:30 PM GMT
స్వామిరారా కాంబినేషన్ స్ట్రైక్స్ బ్యాక్
X
స్వామిరారా.. టాలీవుడ్లో గత పదేళ్లలో వచ్చిన ట్రెండ్ సెట్టింగ్ సినిమాల్లో ఒకటి. మంచి కిక్కిచ్చే క్రైమ్ కామెడీ సినిమాలు పూర్తిగా కనుమరైపోతున్న రోజుల్లో యువ దర్శకుడు సుధీర్ వర్మ టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇస్తూ తీసిన సినిమా ఇది. ఈ సినిమాతోనే యువ కథానాయకుడు నిఖిల్ రాత మారింది. అప్పటిదాకా అల్లాటప్పా సినిమాలు చేస్తూ వచ్చిన నిఖిల్.. ‘స్వామిరారా’తో ఒక్కసారిగా ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించాడు. అక్కడి నుంచి విభిన్నమైన కంటెంట్ ఉన్న సినిమాలతో సాగిపోతున్నాడు.

‘స్వామి రారా’ తర్వాత వెంటనే అక్కినేని నాగచైతన్యతో సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు సుధీర్. కానీ ‘దోచేయ్’ తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ దెబ్బకు ఏడాది పైగా ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది. మధ్యలో రవితేజతో సినిమా అంటూ ప్రచారం జరిగింది కానీ.. అది కార్యరూపం దాల్చలేదు. ఐతే చివరికి తన తొలి సినిమా హీరో నిఖిల్‌ తోనే సినిమా చేయడానికి రెడీ అయిపోయాడు సుధీర్.

నిన్న అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ ఒకేసారి నిర్మాతగా ఐదు ప్రాజెక్టుల్ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందులో సుధీర్ వర్మ-నిఖిల్ కాంబినేషన్లోనూ ఓ సినిమా ఉంది. ఈ విషయాన్ని సుధీర్.. నిఖిల్ కూడా కన్ఫమ్ చేశారు. తన కెరీర్ ను మలుపుతిప్పిన దర్శకుడితో మళ్లీ పని చేయబోతుండటం చాలా హ్యాపీగా ఉందని.. ‘స్వామిరారా’ తరహాలోనే మరో విభిన్నమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తామని చెప్పాడు నిఖిల్. మరి ఈ సెన్సేషనల్ కాంబినేషన్లో రాబోతున్న రెండో సినిమా ఎలా ఉంటుందో.. సుధీర్ మళ్లీ తనేంటో రుజువు చేసుకుంటాడో లేదో చూద్దాం.