Begin typing your search above and press return to search.
ఫుల్ యాక్షన్ మోడ్ లో నిఖిల్.. క్లిక్ అవుతాడా?
By: Tupaki Desk | 30 Jan 2023 5:13 PM GMTహీరో నిఖిల్‌కు గత ఏడాది బాగానే కలిసి వచ్చిందనే చెప్పవచ్చు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన నిఖిల్ కార్తికేయ 2 సినిమా దేశ వ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. నార్త్ ఆడియెన్స్ కు ఈ సినిమా బాగా కనెక్ట్ అయ్యింది. నిఖిల్ ను ఒక్క సారిగా కార్తికేయ 2 పాన్ ఇండియన్ స్టార్ ని చేసింది. ఆ తరువాత వెంటనే 18 పేజెస్ అంటూ మరో బ్లాక్ బస్టర్ హిట్ ను కొట్టేశాడు.
నేఅయితే ఈ సినిమాను కూడా నార్త్ లో విడుదల చేయండని ఆయన అభిమానులు కోరినా ఇది కేవలం తెలుగు వారి కోసమే తీసిన సినిమా అని క్లారిటీ ఇచ్చాడు. కానీ ఇకపై తాను చేయబోయే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియన్ రేంజ్ లోనే ఉంటాయని నిఖిల్ చెప్పుకొచ్చాడు. కార్తికేయ 3, స్పై సినిమాలు పాన్ ఇండియన్ వైడ్ గా రిలీజ్ అవుతాయని తెలిపాడు.
ఇక నిఖిల్ స్పై నుంచి విడుదల అయిన పోస్టర్స్ ఇప్పటికే ఆకట్టుకుంటున్నాయి. తాజాగా నిఖిల్ తన సోషల్ మీడియా ఖాతా నుంచి అఫీషియల్ లీక్ అంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాడు. తాజాగా విడుదలైన నిఖిల్ లుక్ ఫ్యాన్స్ ను తెగ ఆకట్టుకుంటోంది. సినిమాపై మరింత హైప్ పెంచుతోంది.
పోస్టర్ ను గమనిస్తే.. అందులో నిఖిల్ గన్ పట్టుకుని సీరియస్‌లో లుక్ లో ఉన్నాడు. నిఖిల్ తన ఇన్‌స్టాలో రాస్తూ.. అఫీషియల్ లీక్.. కార్తికేయ-2 తర్వాత భారీ చిత్రంతో మీ ముందుకు వస్తున్నా... మల్టీ లాంగ్వేజ్ స్పై థ్రిల్లర్ ఈ వేసవిలో మీ ముందుకు రానుంది.. అంటూ పోస్ట్ చేశారు. నిఖిల్ లుక్ చూసిన ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు. అన్నా నీ సినిమా కోసం వెయిటింగ్ అని కామెంట్స్ పెడుతున్నారు. కొంత మంది బ్లాక్ బస్టర్ అని కామెంట్స్ పెడుతున్నారు. నిఖిల్ ప్రస్తుతం స్పై సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత కార్తికేయ మూడో పార్ట్ మీద ఫోకస్ పెట్టేట్టు కనిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.