Begin typing your search above and press return to search.
ఏసియన్ వారితో నిఖిల్ న్యూ ప్రాజెక్ట్...!
By: Tupaki Desk | 31 July 2020 1:00 PM ISTఏసియన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ వారు నిర్మాతలుగా మారి శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కినేని నాగ చైతన్య - శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో 'లవ్ స్టోరీ' అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో యువ హీరో నాగ శౌర్య కెరీర్లో 20వ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించారు. దీంతోపాటు కింగ్ నాగార్జున - ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో ఓ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నారు. అంతేకాకుండా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో మరో భారీ ప్రాజెక్ట్ నిర్మించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా యంగ్ హీరో నిఖిల్ తో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసారు.
కాగా నిఖిల్ కెరీర్లో 20వ చిత్రంగా రానున్న ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. 'అర్జున్ సురవరం' సక్సెస్ తో మంచి జోష్ లో ఉన్న నిఖిల్ కి ఈ చిత్రం గుర్తుండిపోయే సినిమాగా మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని మేకర్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి డైరెక్టర్ మరియు నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తామని నిర్మాతలు ప్రకటించారు. నిఖిల్ ప్రస్తుతం 'కార్తికేయ' సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కుతున్న 'కార్తికేయ 2' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. దీంతో పాటు 'కుమారి 21F' ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో '18 పేజెస్' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.