Begin typing your search above and press return to search.
క్లీవేజ్ ఏంది నిఖిల్ భయ్యా?
By: Tupaki Desk | 18 Jan 2019 4:31 PM GMTయంగ్ హీరో నిఖిల్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడని అందరికీ తెలిసిందే. కానీ అప్పుడప్పుడూ ఉత్సాహంతో చేసే ట్వీట్లు కాస్త వివాదాన్ని రేపుతాయి. విజయ్ దేవరకొండ విషయంలో పరోక్షంగా ట్వీట్లు గుప్పించడం.. ఆతర్వాత నెటిజనులు ట్రోలింగ్ చేయడంతో ట్వీట్ తొలగించడం అంతా జనాలకు గుర్తుంది. అ తర్వాత 'టాక్సీవాలా' సమయంలో పాజిటివ్ ట్వీట్ చేసి నెగెటివిటీని కాస్త తగ్గించుకున్నాడు.
మళ్ళీ ఇప్పుడు సోషల్ మీడియాలో నిఖిల్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. సోషల్ మీడియాలో ప్రస్తుతం #10YearsChallenge జోరుగా సాగుతోంది. పదేళ్ళ క్రితం ఫోటో.. ఇప్పటి ఫోటోను పోస్ట్ చేయడం అనేది ఇందులో కాన్సెప్ట్. వెయిట్ లాస్ ప్రోగ్రాం అడ్వర్టైజ్ మెంట్స్ లో చూపిస్తారు కదా అలా అన్నమాట. ఈ ఛాలెంజ్ లో భాగంగా నిఖిల్ 2009 లో తీసిన ఫోటో..2019 లో తీసిన ఫోటోను తన ట్విట్టర్ ఖాతాద్వారా పోస్ట్ చేశాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ మొదటి ఫోటోకు "2009 - నా క్లీవేజ్ చూపించాలా వద్దా?" అని క్యాప్షన్ ఉంటే రెండో ఫోటోకు "2019 - చూడండి" అని ఉంది.
మొదటి ఫోటోలో సాధారణంగా ఉన్న నిఖిల్ తాజా ఫోటోలో మాత్రం కండలు పెంచి వస్తాదులా ఉన్నాడు. బైసెప్స్ తో పాటుగా చెస్ట్ ను ఎక్స్ పోజ్ చేస్తూ టీ-షర్ట్ ను కిందకు లాగాడు. ఫోటోలు మాత్రం పోస్ట్ చేసి ఉంటే బాగుండేది కానీ ఈ క్లీవేజ్ క్యాప్షన్ పై నెటిజనులు పెదవి విరుస్తున్నారు. సహజంగా లేడీస్ కి వాడే ఆ పదాన్ని వాడడం ఎబ్బెట్టుగా ఉందని అంటున్నారు. అయినా అదేం క్యాప్షన్ నిఖిల్ భయ్యా..? క్లీవేజులు గట్రా చూపించేందుకు చాలామంది హాట్ బ్యూటీలు ఉన్నారు కదా నీకెందుకు ఆ శ్రమ.. అని చిరాకు పడుతున్నారు.