Begin typing your search above and press return to search.

బాహుబలికి దర్శకుడు ఎవరన్న హీరో?

By:  Tupaki Desk   |   10 May 2017 11:18 AM GMT
బాహుబలికి దర్శకుడు ఎవరన్న హీరో?
X
బాహుబలి సినిమా గురించి తెలిసిన వాళ్లందరికీ రాజమౌళి తెలుసు. మామూలుగా ఓ సినిమా పెద్ద హిట్టయితే హీరో గురించే మాట్లాడుకుంటారు. కానీ ‘బహుబలి’ విషయంలో మాత్రం దీనికి భిన్నం. రాజమౌళి గురించే చర్చ జరుగుతోంది. దేశవ్యాప్తంగా రాజమౌళి పేరు మార్మోగిపోతోంది. అలాంటిది తెలుగులో ఒక హీరోకు ‘బాహుబలి’ దర్శకుడు రాజమౌళి అని తెలియదట. ఒక హీరోయిన్ బాహుబలి గురించి అడిగితే.. ఆ సినిమాకు దర్శకుడు ఎవరు అంటూ యారొగెంట్ గా ఎదురు ప్రశ్న వేశాడట. ‘కొమరం పులి’ సినిమాలో కథానాయకిగా నటించిన నికీషా పటేల్ ఈ విషయం వెల్లడించింది.

ఒక తెలుగు నటుడిని బాహుబలి సినిమా చూశావా అని అడగ్గా.. ఆ సినిమాను డైరెక్ట్ చేసింది ఎవరు అని ఎదురు ప్రశ్న వేశాడని.. ఇంత నిర్లక్ష్యంగా.. సిగ్గు లేకుండా ఎలా ఉంటాడు? అతణ్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది అంటూ ఒక ట్వీట్ పెట్టింది నికీషా. మరి నికీషాను అలా అడిగిన ఆ హీరో ఎవరు అన్న చర్చ మొదలైంది టాలీవుడ్లో. తెలుగులో నికీషా.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ‘కొమరం పులి’లో నటించింది. ఐతే పవన్ తో ఇలా కబుర్లాడేంత చనువు నికీషాకు ఉంటుందా అన్నది సందేహమే. ‘కొమరం పులి’ కాకుండా ఆమె నటించిన సినిమాలు అంత చెప్పుకోదగ్గవేమీ కాదు. మరి నికీషాను అలా ప్రశ్నించిన హీరో ఎవరో తెలియాలి మరి. ఎవరో ఒక స్టార్ హీరోనే కావాలని ఇలా అడిగాడని భావిస్తున్నారు