Begin typing your search above and press return to search.
పులిపిల్ల పిల్ల ఇంకా ప్రయత్నిస్తోంది
By: Tupaki Desk | 6 April 2018 10:50 AM ISTటాలీవుడ్ లో గత కొంత కాలంగా ఎంతో మంది హీరోయిన్స్ వస్తున్నారు పోతున్నారు. ఒక్కసారిగా వెలిగిపోయిన కొందరు ముద్దుగుమ్మలు మళ్లీ కనిపించడం లేదు. అలాగే మరికొంత మంది మొదటి సినిమాతోనే స్టార్ హీరోల దగ్గర ఛాన్స్ కొట్టేసిన ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కనిపించలేదు. ఆ లిస్ట్ లో పవన్ కళ్యాణ్ హీరోయిన్ ఉంది. నికిషా పటేల్ అందరికి గుర్తుండే ఉంటుంది. పవన్ - ఎస్ జే. సూర్య కాంబినేషన్ లో వచ్చిన పులి సినిమాలో నికిషా కనిపించిన సంగతి తెలిసిందే.
అయితే మొదటి అడుగులోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించడంతో ఇక ఇండస్ట్రీలోకి మరో స్టార్ హీరోయిన్ వచ్చిందని అనుకున్నారు. కానీ సినిమా అనుకున్నంత రేంజ్ లో విజయాన్ని అందుకోకపోవడంతో నికిషాకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అలాగని ప్రయత్నాలు మానడం లేదు. సరికొత్త ఫొటో షూట్స్ తో సోషల్ మీడియా ద్వారా ఆఫర్స్ ను అందుకోవాలని చూస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ఫొటోలో అయితే అమ్మడు చాలా హాట్ గా కనిపించింది.
తన పరువాలపై వైట్ క్లాత్ కప్పుకొని అందమైన చిరునవ్వుతో మాయ చేసేసింది. నెటిజన్స్ ఎవరి స్టైల్ లో వారు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. పులి పిల్ల ప్రయత్నాలు ఏ మాత్రం తగ్గడం లేదు కదా అని చెబుతున్నారు. ఇక గత ఏడాది వరకు తమిళ్ లో చేసింది. ఇప్పుడు కన్నడ లో కొన్ని అవకాశాలను అందుకున్నట్లు సమాచారం.