Begin typing your search above and press return to search.

డేంజరస్ ప్లేసులో బికినీల గోల

By:  Tupaki Desk   |   5 Sept 2017 6:29 PM IST
డేంజరస్ ప్లేసులో బికినీల గోల
X
ఇప్పటి తరం హీరోయిన్లు అందరూ.. షూటింగ్ ఉన్నన్ని రోజులూ కష్టపడి పనిచేయడం.. ఒక్కసారి షెడ్యూల్ గ్యాప్ రాగానే ఇతర దేశాలకు వెళ్ళి సేదతీరడం వంటివే ఎక్కువగా చేస్తున్నారు. అయితే స్వతాహాగానే బ్రిటన్ లో సెటిలైన భారతీయ సంతతికి చెందిన నికీషా పటేల్.. ఇక్కడ షూటింగ్ లేకపోతే లండన్ లోనే ఉంటుంది. అంతే కాదు.. అటునుండటే టూర్లకు వెళ్తుంటుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు ఈజిప్ట్ దేశంలో తన వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. అక్కడ పిరమిడ్లు చూడ్డానికి వెళ్ళలేదండోయ్. అమ్మడు చక్కగా రెడీ సముద్రం తీరంలో ఉన్న హుర్గ్ హాడా అనే నగరంలో సేద తీరుతోంది. తన ఫ్యామిలీతో కలసి టూరుకు వెళ్ళినా కూడా.. టూ పీస్ బికినీల్లో నిండుగా దర్శనమిస్తూ.. ఎండకు సన్ బాతింగ్ చేస్తున్నాను అంటోంది నికీషా. అక్కడ నుండి ఆమె షేర్ చేస్తోన్న రకరకాల పోస్టులను చూస్తుంటే.. ఇంత సెక్సీగా ఉందేంటి పిల్ల అంటూ మన మతిపోవాల్సిందే. అయితే ఈమె అభిమానులు ఇవన్నీ చూసి భయపడుతున్నారు.

ప్రస్తుతం ఈజిప్టులో పరిస్థితులు అంత బాగాలేదు. నిజానికి అక్కడ ఈ మధ్యనే క్రిస్టియన్లపై ముస్లిం తీవ్రవాదులు దాడులు ఎక్కువయ్యాయ్. ఐసిస్ వంటి భయంకర తీవ్రవాద సంస్థలకు మద్దతిచ్చే లోకల్ గ్రూపులు చాలానే ఉన్నాయి. వీరు ఎప్పుడు ఫారిన్ టూరిస్టులపై విరుచుకుపడతారో ఎవ్వరికీ తెలియదు. అందుకే అంత డేంజరస్ ప్లేసులో ఈ బికినీ ట్రీట్ ఏంటి పాపాయ్ అంటూ జనాలు కంగారుపడుతోంది.