Begin typing your search above and press return to search.

సడెన్ ఛేంజ్ ఇండస్ట్రీకి నచ్చింది

By:  Tupaki Desk   |   24 Aug 2017 5:24 AM GMT
సడెన్ ఛేంజ్ ఇండస్ట్రీకి నచ్చింది
X
మొదటి సినిమా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ తో చేసినా రావాల్సినంత గుర్తింపు రాలేదని ఎప్పుడూ బాధ పడుతుంటుంది గుజరాతీ సుందరి నికిషా పటేల్. పులి సినిమా తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బెంగుళూరు వెళ్లిపోయి కన్నడ సీమలో అవకాశాలు వెతుక్కుంది. తర్వాత తమిళంలోనూ ఒకటి - రెండు సినిమాలు చేసింది. కాకుంటే ఎక్కడా కూడా పెద్దగా పేరయితే రాలేదు.

ఈమధ్య కాలంలో ఈ భామ పెద్దగా కనిపించలేదు. ఏదో సినిమా షూటింగ్ కోసం ఫారిన్ వెళ్లిందని అనుకుంటే ఒక్కసారిగా స్లిమ్ అండ్ ఫిట్ లుక్ తో కొత్తగా దర్శనమిచ్చింది. ఈ మార్పు వెనుక కారణమేంటని అడిగితే తాను కోరుకున్న రోల్స్ దక్కకపోవడమేనని చెప్పుకొచ్చింది. ‘సినిమాల్లోకి వచ్చినప్పటితో పోలిస్తే బాగానే లావయ్యాను. దీంతో నేను చేయాలని కోరుకుంటున్న రోల్స్ రావడం లేదని అర్ధమైంది. నా లుక్ మారనిదే ప్రయోజనం ఉండదన్న క్లారిటీ వచ్చింది. అందుకే చాలా కష్టపడి వర్కవుట్స్ చేసి పది కేజీల వరకు తగ్గాను’ అంటూ నికీషా తన మార్పు వెనక రీజన్ ను వివరించింది.

అదృష్టవశాత్తు నికిషాలోని ఈ సడెన్ ఛేంజ్ ఇండస్ట్రీకి కూడా బాగానే నచ్చినట్టుంది. ఇప్పుడు తనకు బోలెడన్ని ఆఫర్స్ వస్తున్నాయని ఈ ముద్దుగుమ్మ ఆనందంగా చెబుతోంది. తెలుగులో తాజాగా గుంటూరు టాకీస్ సీక్వెల్ లో నికిషా నటించనుంది. దీంతోపాటు మళయాళం సినిమా 100 డిగ్రీ సెల్సియస్ రీమేక్ లో.. తెలుగు - తమిళ భాషలో ఒకేసారి తెరకెక్కుతున్న మరో సినిమాలోనూ నికిషా అవకాశం దక్కించుకుంది. కోరుకున్న అవకాశాలు వస్తుండటంతో స్లిమ్ ఫిగర్ జాగ్రత్తగా మెయిన్ టెయిన్ చేస్తానని అంటోంది. అవును మరి.. ఎంతయినా చక్కనమ్మ చిక్కితే అందమే కదా.