Begin typing your search above and press return to search.
తన తల్లి నిశ్చితార్థ చీరలో పెళ్లికూతురు నిహారిక
By: Tupaki Desk | 7 Dec 2020 9:34 AM ISTనిహారిక కొణిదెల -చైతన్య జంట వివాహం ఈనెల 9న రాజస్థాన్ ఉదయ్ పూర్ లో ఉదయ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి- పవన్ కల్యాణ్.. మెగా యువహీరోలు సహా ఇండస్ట్రీ ప్రముఖులు ఎటెండవుతున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లోని నాగబాబు ఇంట ప్రీవెడ్డింగ్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. ఇంతకుముందు నిహారికను పెళ్లికూతురిని చేసినప్పటి ఫోటోలు అంతర్జాలంలోకి దూసుకెళ్లాయి.
తాజాగా నిహారికా కొణిదేల తన తల్లి ఎంగేజ్ మెంట్(నిశ్చితార్థం) చీరను ధరించి కనిపించారు. ప్రీ వెడ్డింగ్ కార్యక్రమాల్లో భాగంగా నిహారిక ఇలా బ్లూ .. జెరీ అంచు చీరలో మెరిసిపోయారు. పెళ్లికూతురి గెటప్ లో సిగ్గుల మొగ్గవుతూ చిరునవ్వులు చిందిస్తున్నారు.
నిహారికా డెస్టినేషన్ వెడ్డింగ్ ప్రస్తుతం ఇండస్ట్రీ సహా సామాన్య ప్రజల్లో చర్చనీయాంశమైంది. హైదరాబాద్ లో కొన్ని వివాహ ఆచారాలు పూర్తయ్యాయి. నిహారిక- చైతన్య జెవి ప్రీవెడ్డింగ్ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వధువు ఇంట ఎమోషనల్ క్షణాలు.. ఆమె ఒక ఫంక్షన్ కోసం తన తల్లి ఎంగేజ్మెంట్ చీరను ఎంచుకోవడం అభిమానుల్లో చర్చకు వచ్చింది.
అదే నీలిరంగు చీరలో ఉండగా.. తన తల్లి చిత్రాన్ని పంచుకుంటూ, నిహారికా ``32 సంవత్సరాలు`` అని క్యాప్షన్ ఇచ్చింది. మునుపెన్నడూ లేనంత సంతోషంగా మెగా ప్రిన్సెస్ కనిపిస్తోంది.
చిరంజీవి కుమార్తెలు సుష్మితా కొణిదేల- శ్రీజా కల్యాణ్.. సోదరుడు వరుణ్ తేజ్ ఇతర కుటుంబ సభ్యులు నిహారికా ఇంట్లో జరిగిన వివాహ పూర్వ వేడుకలకు హాజరయ్యారు.
ఇక వరుడి వివరాల్లోకి వెళితే.. చైతన్య గుంటూరు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జె ప్రభాకర్ రావు కుమారుడు. ఈ సంవత్సరం ఆగస్టులో ఈ జంట నిశ్చితార్తం జరిగింది. చైతన్య జెవి ప్రస్తుతం ఎంఎన్ సిలో బిజినెస్ స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నారు.