Begin typing your search above and press return to search.
అన్న బంగారు కొండ.. వరుణ్ ట్వీట్ పై నిహా
By: Tupaki Desk | 19 Dec 2020 10:31 AM ISTమెగా ప్రిన్సెస్ నిహారిక ఇటీవల చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. ఆమె వివాహ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్ లోని రాజ ప్రసాదంలో నిర్వహించిన నిహారిక పెళ్లి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. పెళ్లి నిర్వాహణలో వరుణ్ తేజ్ కీలక పాత్ర పోషించాడు అంటూ ఆయన తండ్రి నాగబాబు పలు సందర్బాల్లో చెప్పుకొచ్చాడు. చెల్లి నిహారికపై ఉన్న ప్రేమను వరుణ్ ఇలా చూపించాడని అంటున్నారు. ఇక నిహారిక పుట్టిన రోజు సందర్బంగా మరోసారి వరుణ్ తన సోదరి ప్రేమను వరుణ్ చూపించాడు. సోషల్ మీడియాలో చాలా ఎమోషనల్ గా వరుణ్ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ కు నిహారిక చేసిన ట్వీట్ కూడా హైలైట్ అయ్యింది. ఈ ఇద్దరు అన్న చెల్లెల ట్వీట్స్ అందరిని ఎమోషనల్ గా కట్టి పడేశాయి.
నిహారిక పుట్టిన రోజు సందర్బంగా వరుణ్ ట్విట్టర్ లో... నువ్వు అప్పుడే ఇంత పెద్ద అమ్మాయివి అయ్యావు అంటే నేను నమ్మలేక పోతున్నాను. అయినా కూడా నువ్వు నాకు ఎప్పటికి చిన్న పిల్లవే. నీ చుట్టు ఉన్న వారిలో ఎప్పుడు ఆనందాన్ని నింపుతూ వచ్చావు. నీవు నా జీవితంలో ఉన్నందుకు నేనెంతో లక్కీ.. హ్యాపీ బర్త్ డే బంగారు తల్లి అంటూ ఒక తండ్రి లాగా ట్వీట్ చేశాడు. వరుణ్ ట్వీట్ కు నిహారిక స్పందించింది. అన్నా... బంగారు కొండ ఐ లవ్ యు సో మచ్ అంటూ ముద్దుల ఈమోజీలు కురిపించింది.