Begin typing your search above and press return to search.

మరో స్టార్‌ నటుడు మీటూ బారిన పడ్డాడు!

By:  Tupaki Desk   |   10 Nov 2018 5:03 PM IST
మరో స్టార్‌ నటుడు మీటూ బారిన పడ్డాడు!
X
బాలీవుడ్‌ లో మీటూ ఉద్యమంలో భాగంగా పెద్ద ఎత్తున స్టార్స్‌ పై ఆరోపణలు వెళ్లువెత్తుతున్న విషయం తెల్సిందే. ఇప్పటికే పలువురు దర్శకుల మరియు నిర్మాతల పరువు పోయింది. చేసిన ఆరోపణలు నిజయో కాదో తెలియదు కాని ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు మాత్రం సినిమాల ఆపర్లు పోగొట్టుకుంటున్నారు. తాజాగా మరో స్టార్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్దిఖీ కూడా మీటూ బారిన పడ్డాడు. మాజీ మిస్‌ ఇండియా నిహారిక సింగ్‌ సంచలన ఆరోపణలు ప్రస్తుతం బాలీవుడ్‌ ను కుదిపేస్తున్నాయి.

కొన్నాళ్ల క్రితం నవాజుద్దీన్‌ సిద్దిఖీ మరియు నిహారిక సింగ్‌ లు సహజీవనం చేశారు. కాని ఇప్పుడు తాను మోసపోయాను అంటూ నిహారిక సింగ్‌ మీడియా ముందుకు వచ్చింది. నవాజుద్దీన్‌ సిద్దిఖీ అంతా అనుకుంటున్నట్లుగా మంచి వాడు కాదని ఆమె చెప్పుకొచ్చింది. సోషల్‌ మీడియాలో నిహారిక సింగ్‌ పలు సంచలన ఆరోపణలు చేసింది. 2009వ సంవత్సరంలో ‘మిస్‌ లవ్లీ’ చిత్రంలో నవాజుద్దిన్‌ తో కలిసి నటించాను. ఆ సమయంలోనే ఆయనతో పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఇద్దరి మద్య మంచి స్నేహం ఏర్పడినది. అప్పటి నుండి కూడా ఇద్దరం చాలా క్లోజ్‌ గా ఉంటూ వచ్చాం.

నాకు సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తాను అంటూ నాతో స్నేహం చేశాడు. ఆయన చూపించిన ఆధరణకు నేను ఆయన పట్ల ఆరాధన భావం పెంచుకున్నాను. మంచి మాటలు చెప్పి ఆయన నన్ను నమ్మించాడు. ఒకరోజు ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో నన్ను బలవంతంగా కౌగిలించుకున్నాడు. ఆయన్ను వదిలించుకునేందుకు ప్రయత్నించగా, అతడు బలవంతంగా కౌగిలించుకోవడంతో అతడి కౌగిలిలో ఒదిగి పోయాను. ఆ తర్వా నుండి ఆయనతో సహజీవనం కూడా చేశాను. అప్పుడే అతడు గతంలో పలువురు అమ్మాయిలతో సంబంధం పెట్టుకున్నాడని, పెళ్లి అయ్యి వరకట్న వేదింపుల కేసును ఎదుర్కొంటున్నట్లుగా కూడా తెలిసింది. దాంతో ఆయనకు నేను దూరం అయ్యాను. దూరం అయిన తర్వాత కూడా నాతో సంబంధం కోరుకున్నాడు అంటూ నిహారిక సంచలన ఆరోపణలు చేసింది. విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న నవాజుద్దీన్‌ సిద్దిఖీ పై నిహారిక చేసిన వ్యాఖ్యలతో ఆయన కెరీర్‌ పై ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ సమయంలో నవాజుద్దీన్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.