Begin typing your search above and press return to search.

#మెగా ప్రిన్సెస్‌.. చెల్లి పెళ్లిలో అక్క‌ల సందడి

By:  Tupaki Desk   |   28 Nov 2020 10:30 AM GMT
#మెగా ప్రిన్సెస్‌.. చెల్లి పెళ్లిలో అక్క‌ల సందడి
X
మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక కొణిదెల .. ఐజీ కుమారుడు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ చైత‌న్య దంతులూరిని పెళ్లాడుతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ లో ఈ జంట వివాహం ఉద‌య్ పూర్ ప్యాలెస్ (రాజ‌స్థాన్) లో జ‌ర‌గ‌నుంది. ఈ పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్ల‌ను నిహారిక సోద‌రుడు వ‌రుణ్ తేజ్ స్వ‌యంగా ద‌గ్గ‌రుండి మ‌రీ చూసుకుంటున్నారు. ఉద‌య్ పూర్ లో చాలా ముందే ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ స్టార్ట‌య్యాయి.

డిసెంబ‌ర్ 9న ఉద‌య్ ప్యాలెస్ లో ఈ వివాహం జ‌ర‌గ‌నుంది. వివాహ వేదిక వ‌ద్ద‌కు రెండ్రోజుల ముందే ప‌వ‌న్ క‌ల్యాణ్ హాజ‌ర‌వుతార‌నిపెళ్లి ప‌నుల్ని స్వ‌యంగా ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షిస్తార‌ని అలాగే పెళ్లి రోజు మెగా హీరోలంతా సంద‌డి చేస్తార‌ని క‌థ‌నాలొస్తున్నాయి.

తాజాగా నిహారిక కొణిదెల త‌న అక్క‌య్య (సిస్ట‌ర్స్) లంద‌రితో ఇదిగో ఇలా డిన్న‌ర్ పార్టీని ఆస్వాధిస్తున్నారు. ఈ పార్టీలో మెగాస్టార్ కుమార్తెలు సుశ్మిత‌- శ్రీ‌జ త‌దిత‌రులు ఉన్నారు. చెల్లి పెళ్లి పేరుతో ఈ ఫోటోలు అంత‌ర్జాలంలో సంద‌డి చేస్తున్నాయి. ఇంత‌కుముందు నిహారిక త‌న స్నేహితుల‌తో క‌లిసి గోవా లో బ్యాచిల‌ర్స్ పార్టీని సెల‌బ్రేట్ చేసిన సంగ‌తి తెలిసిందే.