Begin typing your search above and press return to search.

#నిహారిక‌.. రిసెప్ష‌న్ లో సెల్ఫీలు దిగిన కొలీగ్స్

By:  Tupaki Desk   |   16 Dec 2020 1:56 PM GMT
#నిహారిక‌.. రిసెప్ష‌న్ లో సెల్ఫీలు దిగిన కొలీగ్స్
X
మెగా ప్రిన్సెస్ నిహారిక టెకీ చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. గుంటూరు రేంజి ఐజీ కుమారుడు అయిన చైత‌న్య ఆర‌డుగుల ఒడ్డు పొడుగుతో మెగా అంద‌గాడిగా మురిపిస్తుంటే .. మెగా క్రికెట్ టీమ్ లో చేరాడు! అంటూ అభిమానుల నుంచి స‌ర‌దా వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. చైత‌న్య హీరోగా ఆరంగేట్రం చేస్తాడా? అంటూ పెళ్లి ముందు నుంచే గుస‌గుస‌లు వినిపించాయి.

అదంతా స‌రే కానీ.. రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లో రెండ్రోజుల డెస్టినేష‌న్ వెడ్డింగ్ అనంత‌రం హైద‌రాబాద్ లో ఈ జంట వివాహ రిసెప్ష‌న్ ని ఏర్పాటు చేసింది. ఈ రిసెప్ష‌న్ కి ప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు స‌హా నిహారిక కొలీగ్స్ కూడా అటెండ‌య్యారు. ఇక రిసెప్ష‌న్ లోనూ నిహారిక వెబ్ సిరీస్ టీమ్ స‌భ్యులు సంద‌డి చేయ‌డం విశేషం. ప్ర‌తి ఒక్క‌రూ సెల్ఫీలు దిగుతూ నిశ్చ‌య్ జంట‌తో స‌ర‌దా ముచ్చ‌ట్లాడ‌డం ఈ రిసెప్షన్ లో క‌నిపించింది.

డెస్టినేష‌న్ వెడ్డింగ్.. పైగా కోవిడ్ నియ‌మ‌నిబంధ‌న‌ల వ‌ల్ల కేవ‌లం 100 మంది కీల‌క అతిథుల న‌డుమ ఈ వివాహం జ‌రిగింది. దీంతో పెళ్లిలో చాలామంది ప్ర‌ముఖులు మిస్స‌య్యారు. వీరంద‌రికీ రిసెప్ష‌న్ కి ఆహ్వానం అందింది.