Begin typing your search above and press return to search.

నీహారిక సెకండ్ మూవీకి రెడీ

By:  Tupaki Desk   |   16 Jun 2017 9:17 AM GMT
నీహారిక సెకండ్ మూవీకి రెడీ
X
మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు చాలామందే వచ్చినా హీరోయిన్ గా సినిమాల్లోకి అడుగు పెట్టింది నాగబాబు కుమార్తె నీహారిక మాత్రమే. ముందుగా టీవీల్లో గేమ్ షోస్ చేయడంతోపాటు షార్ట్ ఫిలిమ్స్ తీయడం ద్వారా తనలోని టాలెంట్ ను బయటపెట్టి అందరినీ మెప్పించింది. నటన పట్ల తనకున్న ప్యాషన్ - కమిట్ మెంట్ తో తండ్రి - పెదనాన్నలను ఒప్పించి సినీరంగ ప్రవేశం చేసింది. తొలి చిత్రంగా యంగ్ హీరో నాగశౌర్యకు జంటగా చేసిన ‘ఒక మనసు’ బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ అవకపోయినా నటిగా నీహారికకు మంచి మార్కులే వచ్చాయి.

ఒక మనసు తర్వాత కొద్దికాలం గ్యాప్ తీసుకున్న నీహారిక ఇప్పుడు రెండో ఫిలిం చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సారి ఆమె కొత్త బ్యానర్ లో చేయనుంది. ఎం.ఆర్. ఎంటర్ టైన్ మెంట్స్ అండ్ కవితా కంబైన్స్ బ్యానర్ పై మారిశెట్టి రాఘవయ్య బండారు బాబి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు రవి దుర్గా ప్రసాద్ డైరెక్షన్ చేయబోతున్నారు. రవి దుర్గా ప్రసాద్ ఈ సినిమాతోనే తొలిసారి మెగా ఫోన్ పట్టుకోనున్నాడు. ఇంతకుముందు ప్రభుదేవా - మెహర్ రమేష్ - రాహుల్ బోస్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.

నీహారిక ఫస్ట్ ఫిలిం ఒక మనసు మొత్తం ట్రెడిషనల్ గానే కనిపించింది. ఒక్క సీన్ లో కూడా మోడ్రన్ డ్రస్సులో కనిపించదు. ఆసాంతం అదే గెటప్ లో కొనసాగడంతో ఆమెలోని గ్లామర్ కంటెంట్ ఏ కొంచెం వెలుగులోకి రాలేదు. కనీసం ఈ సినిమాలో అయినా లుక్ మారుస్తుందో లేదో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/