Begin typing your search above and press return to search.

'నాన్న కూచి' అంటున్న నిహారిక

By:  Tupaki Desk   |   15 Jan 2017 7:51 AM GMT
నాన్న కూచి అంటున్న నిహారిక
X
అసలు తెలుగులో 'వెబ్ సిరీస్' అనే ప్రయోగానికి అర్ధం పరమార్ధం చెప్పింది ఎవరంటే మాత్రం.. వెంటనే అందరికా నిహారిక కొణిదెల పేరు మాత్రమే వినిపిస్తుంది. ఈ మెగా ప్రిన్సెస్ ''ముద్దపప్పు ఆవకాయ్'' అనే వెబ్ సిరీస్ తో ఒక ప్రభంజనం సృష్టించింది. యుట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి.. ఈమె గీసిన బాటలో ఏకంగా అనేకమంది వెబ్ సిరీస్ లు చేసేలా చేసింది. అయితే నిహారిక రేంజులో ఒక్క సిరీస్ కూడా సక్సెస్ కాలేదు.

ఇకపోతే ముద్దపప్పు ఆవకాయ్ చేశాక వెంటనే నిహారిక వెండితెరపై మొగ్గుచూపింది. ''నా మనసు'' అంటూ ఒక సినిమా చేసేసి.. హీరోయిన్ గా పరిచయం అయిపోయింది. కాకపోతే ఆ సినిమా ఫెయిల్ కావడంతో.. అసలు తదుపరి ఏం చేయాలా అనే ఆలోచనలో పడింది. అయితే ఇప్పుడు అమ్మడు ఏం చేస్తోందనే విషయంపై ఒక క్లారిటీ వచ్చేసింది. సేమ్ ముద్దపప్పు ఆవకాయ్ చేసిన టీమ్ తోనే ఇప్పుడు అమ్మడు ''నాన్న కూచి'' అంటూ మరో కొత్త వెబ్ సిరీస్ ప్రారంభిస్తోంది. ఇందులో న్యూయెస్ట్ ఎడిషన్ ఎవరంటే.. యుట్యూబ్ తెరపై నాన్న క్యారక్టర్ పోషించడానికి వచ్చిన రియల్ లైఫ్‌ నాన్న.. మెగా బ్రదర్ నాగబాబే.

ఇలా తండ్రికూతుళ్ళు కలసి ఒక వెబ్ సిరీస్ లో నటించడం.. అలాగే అసలు కలిసి నటించడం.. కాస్త వెరైటీగానే ఉంది. చూద్దాం ఈసారి నిహారిక ఎలా ఆకట్టుకుంటుందో!!