Begin typing your search above and press return to search.

#నిహారిక‌.. ఒక‌టి పొందాలంటే ఒక‌టి వ‌దులుకోవాలా!

By:  Tupaki Desk   |   4 Jan 2021 9:30 AM IST
#నిహారిక‌.. ఒక‌టి పొందాలంటే ఒక‌టి వ‌దులుకోవాలా!
X
మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదెల పెళ్లి త‌ర్వాతా సినిమాల్లో న‌టిస్తారా లేదా? ఈ ప్ర‌శ్న‌కు ఇంకా మెగా కాంపౌండ్ నుంచి స‌రైన ఆన్స‌ర్ లేదు. అయితే కెరీర్ కోసం నిహారిక చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ యావ‌రేజ్ గానే సాగ‌డంతో కాస్త నిరాశ‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. అయితే త‌న వెయిటింగ్ ఫలించే స‌మ‌యానికి టెకీ చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌తో పెళ్ల‌య్యింది. నాన్నకిచ్చిన‌ మాట‌కు క‌ట్టుబ‌డి ఒక ఇంటి కోడ‌లు అయిపోయింది.

స‌రిగ్గా ఇక్క‌డే ఓ ట్విస్టు కూడా ఉంది. నిహారిక‌కు వ‌రుస‌గా క‌థ‌లు వినిపించాల‌నుకున్న ద‌ర్శ‌కులు త‌న పెళ్లి ఆలోచ‌న‌లు తెలిసి అటువైపు వెళ్ల‌డ‌మే మానేశార‌న్న గుసగుసా వినిపిస్తోంది. జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా మెగా యువ‌నాయిక‌కు అవ‌కాశాలు ఎప్పుడూ ఉంటాయి. త‌న‌కు ఇంకా రాణించేందుకు చాలా అవ‌కాశం ఉంది. కానీ ఇప్పుడు ఓ ఇంటి నాయిక అయ్యింది కాబ‌ట్టి న‌టిస్తుందా లేదా? అన్న‌ది స‌స్పెన్స్.

అన్న‌ట్టు ఓటీటీలో సూప‌ర్ హిట్ అయిన `క‌ల‌ర్ ఫోటో` మూవీలో నాయిక‌గా ఛాన్స్ నిహారిక‌ను వ‌రించాల్సి ఉండ‌గా అది చాందిని చౌద‌రి అనే యూట్యూబ్ స్టార్ కం నేటిత‌రం హీరోయిన్ కి వెళ్లింది. ఆ ర‌కంగా నిహారిక లాస్ చాందినికి గెయిన్ అనే చెప్పాలి. ఒక‌వేళ క‌ల‌ర్ ఫోటోలో న‌టిస్తే గ్లామ‌ర్ ప‌ర‌మైన తెర‌లు తొల‌గిపోయి వ‌రుస‌గా అవ‌కాశాల వెల్లువ కూడా అంతే ఇదిగా ఉండేద‌ని అంచ‌నా వేస్తున్నారు. క‌ల‌ర్ ఫోటో ద‌ర్శ‌కుడు సందీప్ రాజ్ ఆ పాత్ర‌లో నిహారిక‌నే న‌టింప‌జేయాల‌ని మిడిల్ డ్రాప్ అయ్యారు. ఇక పెళ్లితో నిహారిక హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్నారు కాబ‌ట్టి కెరీర్ సంగ‌తి ఇప్పుడు అన‌వ‌స‌రం. మునుముందు త‌న ప్ర‌ణాళిక‌లు ఎలా ఉంటాయి? అన్న‌ది వేచి చూడాల్సి ఉంది. త్వ‌ర‌లోనే క‌ల‌ర్ ఫోటో థియేట్రిక‌ల్ రిలీజ్ కూడా చేస్తార‌ని సమాచారం.