Begin typing your search above and press return to search.

క‌ల‌ర్ ఫుల్ గా కొణిదెల వారి వెడ్డింగ్ ఇన్విటేష‌న్

By:  Tupaki Desk   |   2 Dec 2020 3:26 AM GMT
క‌ల‌ర్ ఫుల్ గా కొణిదెల వారి వెడ్డింగ్ ఇన్విటేష‌న్
X
మెగా ప్రిన్సెస్ నిహారిక ఐజీ కుమారుడు చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను పెళ్లాడ నున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబ‌ర్ 9న ఈ వివాహం రాజ‌స్థాన్ -ఉద‌య్ పూర్ లోని ఖ‌రీదైన ఉద‌య్ విలాస్ కోర్ట్ ప్యాలెస్ లో జ‌ర‌గ‌నుంది. ఈ వేడుక‌కు చిరంజీవి- ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌హా మెగా హీరోలంతా ఎటెండ్ కానున్నార‌ని స‌మాచారం.

పెళ్లికి ఇంకో ఏడు రోజుల స‌మ‌య‌మే మిగిలి ఉంది. తాజాగా నిహారిక వివాహ శుభ‌లేఖ ను మెగా ఫ్యామిలీ విడుదల చేసింది. రాజస్థాన్ ‌లో నిహారిక పెళ్లి బుధవారం (డిసెంబర్ 9న) జ‌రుగుతుంద‌తి. శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 11న‌) హైదరాబాద్- జెఆర్‌సీ కన్వెన్షన్ సెంట‌ర్ లో విందు జరగనుంది. నిహారిక పెళ్లి వివరాలకు సంబంధించిన వెడ్డింగ్‌ కార్డ్ ప్ర‌స్తుతం నెటిజనుల్లో వైర‌ల్ గా మారింది.

ఆస‌క్తిక‌రంగా ఈ శుభ‌లేఖ డిజైన్ రిచ్ గా కాస్త పెద్ద‌ స్థాయిలోనే ఉంది. నాగబాబు అభిరుచి మేర‌కు ఈ డిజైన్ ని రూపొందించార‌ని అర్థ‌మ‌వుతోంది. ఒక బుల్లి పెట్టెలో ఎంతో అందంగా మెరూన్ క‌ల‌ర్ లో డిజైన్ చేసిన ఈ శుభ‌లేఖ‌తో పాటు చాక్లెట్స్ క‌నిపిస్తున్నాయి. `కొణిదెలాస్ వెడ్డింగ్ ఇన్విటేష‌న్` రేంజు అందులో క‌నిపిస్తోంది.