Begin typing your search above and press return to search.

మంచి ఫొటో మిస్‌ అయిన మెగా డాటర్‌

By:  Tupaki Desk   |   19 Nov 2020 11:50 AM GMT
మంచి ఫొటో మిస్‌ అయిన మెగా డాటర్‌
X
థియేటర్లు లేకున్న కూడా డిజిటల్‌ ప్లాట్‌ ఫామ్‌ ద్వారా వరుసగా సినిమాలు వస్తున్నాయి. ఈమద్య కాలంలో పదుల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. కాని కొన్ని మాత్రమే పాజిటివ్‌ టాక్‌ దక్కించుకున్నాయి. ఒకటి రెండు మాత్రమే సూపర్‌ హిట్‌ టాక్‌ ను దక్కించుకున్నాయి. అందులో కలర్‌ ఫొటో ఒకటి అనడంలో సందేహం లేదు. సందీప్‌ రాజ్‌ దర్శకత్వంలో సాయి రాజేష్‌ ఈ సినిమాను నిర్మించాడు. సుహాస్‌ మరియు ఛాందిన చౌదరి జంటగా ఈ సినిమాలో నటించారు. ఇద్దరు కూడా వారి వారి పాత్రలకు పూర్త న్యాయం చేసి సినిమా సక్సెస్‌ లో కీలక పాత్ర పోషించారు.

ముఖ్యంగా హీరోయిన్‌ దీపు పాత్రకు సినిమాలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఛాందిని చౌదరి నూటికి నూరు శాతం ఆ పాత్రకు న్యాయం చేసింది అంటూ విమర్శకుల ప్రశంసలు దక్కుతున్నాయి. దీపు పాత్ర కోసం మొదట దర్శకుడు సందీప్‌ మెగా డాటర్‌ నిహారికను అనుకున్నాడట. కాని కరోనా సమయంలో షూటింగ్ అవ్వడంతో పాటు ఇతర్రత కారణాల వల్ల సినిమాకు నిహారిక నో చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆమె సున్నితంగా ఆఫర్‌ ను తిరష్కరించడంతో ఆ ఆఫర్‌ ఛాందినికి దక్కింది.

తనకు వచ్చిన ఆఫర్‌ కు పూర్తి న్యాయం చేయడంలో ఛాందిని సక్సెస్‌ అయ్యంది. నటిగా మంచి మార్కులు దక్కించుకున్న ఛాందిని కలర్‌ ఫొటోతో మరిన్ని ఆఫర్లు దక్కించుకుంది. నిహారిక నటిగా గుర్తింపు తెచ్చుకుంది కాని కమర్షియల్‌ సక్సెస్‌ ను మాత్రం అందుకోలేక పోయింది. కమర్షియల్‌ సక్సెస్‌ కాకుండానే నిహారిక పెళ్లికి సిద్దం అయ్యింది. మళ్లీ ఆమె హీరోయిన్‌ గా నటిస్తుందా లేదా అనేది తెలియదు. కలర్‌ ఫొటో సినిమాను చేస్తే కమర్షియల్‌ సక్సెస్‌ ఆమెకు దక్కేది అంటూ మెగా అభిమానులు అయ్యో అంటున్నారు.