Begin typing your search above and press return to search.

నిహారిక - చైత‌న్య‌ల ప్రేమ‌క‌థ గుట్టు విప్పిన‌ నాగ‌బాబు

By:  Tupaki Desk   |   10 Dec 2020 9:34 AM IST
నిహారిక - చైత‌న్య‌ల ప్రేమ‌క‌థ గుట్టు విప్పిన‌ నాగ‌బాబు
X
మెగా డాట‌ర్ నిహారిక ప్రేమ వివాహం చేసుకున్నారా? పెద్ద‌లు కుదుర్చిన సంబంధం మాత్ర‌మేనా? ఈ ప్ర‌శ్న‌కు స‌మాధానం ఇంత‌వ‌ర‌కూ పూర్తి స్ప‌ష్ఠ‌త‌తో లేదు. కానీ ఇప్పుడు అన్ని సందేహాల‌కు చెక్ పెట్టేశారు మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు.

త‌న గారాల ప‌ట్టి నిహారిక - చైత‌న్య ‌ల ప్రేమ‌క‌థ‌ని మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు స్వ‌యంగా బ‌య‌ట‌పెట్టారు. ఉద‌య్ ‌పూర్ ‌లోని ఉదయ్ విలాస్ ప్యాలెస్ లో మెగా ఫ్యామిలీ మెంబ‌ర్స్ తో పాటు అత్యంత స‌న్నిహితుల మ‌ధ్య నిహారిక‌- చైత‌న్య‌ల వివాహం అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. అయితే వీరిద్ద‌రు ప్రేమించుకున్నార‌ని ఆ త‌రువాత ఆ ప్రేమ‌క‌థ త‌న‌కు తెలిసింద‌ని నాగ‌బాబు తెలిపారు. ప్రేమాయ‌ణం త‌రువాతే వీరి పెళ్లి కుదిరింద‌న్న విష‌యం చాలా మందికి తెలియ‌దు.

చాలా కాలంగా ప్రేమ‌లో వున్న నిహారిక‌- చైత‌న్య త‌మ ప్రేమ‌ని పెద్ద‌ల అంగీక‌రింతో పెళ్లి పీట‌ల దాకా తీసుకెళ్లాల‌ని ప్లాన్ చేసుకున్నార‌ట‌. ఇందులో భాగంగానే మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబుకు ద‌గ్గ‌ర‌య్యేందుకు జొన్న‌ల‌గ‌డ్డ చైత‌న్య జూబ్లీహాల్స్ లోని అపోలో జిమ్ లో చేరార‌ట‌. అదే జిమ్ ‌లో నాగ‌బాబు వ‌ర్క‌వుట్ ‌లు చేస్తుండ‌టంతో చైత‌న్య అపోలో జిమ్ ‌లో చేరార‌ట‌. చిన్న‌గా నాగ‌బాబుతో ప‌రిచ‌యం పెంచుకుని రోజూ విష్ చేయ‌డం ప‌నిగా పెట్టుకుని ఇంప్రెస్ చేయ‌డం మొద‌లుపెట్టార‌ట‌. 2015 నుంచి చైత‌న్య‌- నిహారిక ప్లాన్ మొద‌లైంద‌ట‌.

చివ‌ర‌కు గ‌త ఏడాది నిహారిక తన తల్లిదండ్రులకు ప్రేమ వ్య‌వ‌హారం గురించి వెల్లడించిందట‌. ఆమె తండ్రి నాగబాబుకు చైతన్య గురించి సమాచారం ఇచ్చింది. ఆ త‌రువాతే నాగ‌బాబు కుటుంబం చైతన్య కుటుంబం గురించి ఆరా తీశార‌ట‌. చైతన్య తండ్రి గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్రభాకర్ ‌రావు గురించి తెలుసుకున్న తరువాత నాగబాబు నిహారిక ప్రేమ పెళ్లికి గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. ఐజి జె ప్రభాకర్ ‌రావు కు చిరంజీవితో మంచి అనుబంధం వుండ‌టంతో నిహారిక ప్రేమ పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా సాగింది` అని నాగ‌బాబు నిహారిక ప్రేమ పెళ్లి సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టారు.