Begin typing your search above and press return to search.

ఫొటోస్టోరీ: ‌పెళ్లి కూతురు ముఖ‌మంత చాయా

By:  Tupaki Desk   |   5 Dec 2020 4:11 PM GMT
ఫొటోస్టోరీ: ‌పెళ్లి కూతురు ముఖ‌మంత చాయా
X
మెగా ప్రిన్సెస్..., మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు ముద్దుల కూతురు కొణిదెల నిహారిక వెడ్డిండ్ ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక‌ గా మారింది. గుంటూకు చెందిన ఐజీ జొన్న‌ల‌గ‌డ్డ ప్ర‌భాక‌ర‌రావు త‌న‌యుడు చైత‌న్య‌తో ఈ నెల 9న జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే. రాజ‌స్థాన్ ఉద‌య్‌ పూర్‌ లోని ఓబెరాయ్ ఉద‌య్ విలాస్ ‌లో అట్ట‌హాసంగా జ‌ర‌గ‌బోతోంది. పెళ్లికి మ‌రో నాలుగు రోజులే వుండటంతో మెగా డాట‌ర్ నిహారిక‌ని మెగా ఫ్యామిలీ పెళ్లి కూతురుగా ముస్తాబు చేసింది.

శ‌నివారం మెగా ఫ్యామిలీ ఇంటి ఆవ‌ర‌ణ‌లో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ వేడుక‌లో మెగా ఫ్యామిలీ కుటుఏంబ స‌భ్యులు,. బంధు మిత్రులు పాల్గొన్నారు. నూత‌న వ‌ధువు ముఖానికి ప‌సుపురాసి మంగ‌ళ‌స్నానం చేయించారు. మంగ‌ళ స్నానం అనంత‌రం పెళ్లికూతురుగా నిహారిక‌ని ముస్తాబు చేశారు. చిల‌క ఆకుప‌చ్చ క‌ల‌ర్ సారీలో కోటి కాంతుల‌న్నీ ముఖంపై విర‌జిమ్ముతూ నిహారిక అంతులేని ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఫొటోల‌కు పోజులిచ్చింది. నిహారిక పెళ్లి కూతురు ముస్తాబుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని హీరో వ‌రుణ్‌తేజ్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఇవి సోష‌ల్ మీడియాలో సంద‌డి చేస్తున్నాయి.

పెళ్లి కూతురు తంతు పూర్తి కావ‌డంతో మెగా ఫ్యామిలీ అంతా ఈ ఆదివారం రాజ‌స్థాన్‌ లోని ఉద‌య్‌పూర్‌కు ప‌య‌నం కాబోతోంది. అక్క‌డి ఓబెరాయ్ ఉద‌య్ విలాస్ లో నిహారిక‌,... చైత‌న్య‌ల వివాహం జ‌ర‌గ‌బోతోంది. ఈ నెల 9న రాత్రి 7గంట‌ల 15 నిమిషాల‌కు వివాహం జ‌ర‌గ‌బోతోంది. ఇందు కోసం ఓ టీమ్ ఇప్ప‌టికే ఏర్పాట్ల‌ని పూర్తి చేసింది.