Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: నీహారికా అదిరెనుగా

By:  Tupaki Desk   |   20 April 2018 8:57 AM GMT
ఫోటో స్టోరి: నీహారికా అదిరెనుగా
X
మెగా కుటుంబం నుంచి వ‌చ్చిన ఏకైనా హీరోయిన్ నీహారికా. మెగా ఫ్యామిలీ నుంచి ప‌దిమంది దాకా హీరోలు తెలుగు ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చినా హీరోయిన్‌లుగా వ‌చ్చేంత ధైర్యం మాత్రం ఆ ఇంటి ఆడ బిడ్డ‌లు చేయ‌లేదు. తొలిసారి నీహారికా ఆ గ్లాస్‌డోర్‌ను బ‌ద్ద‌లు కొట్టుకుని వ‌చ్చి చిన్న చిన్న సినిమాలు వెబ్ సిరీస్‌లు చేసుకుంటూ పోతోంది. తండ్రి చాటు బిడ్డ‌గా కాకుండా త‌న‌కంటూ సొంత గుర్తింపు కోసం తాప‌త్ర‌య‌ప‌డుతోంది. ఆమె చేసిన ఆవ‌కాయ్ ముద్ద‌ప‌ప్పు వెబ్ సిరీస్ సూప‌ర్ హిట్ కొట్టి నీహారికాలోని న‌టిని బ‌య‌ట‌కు తీసింది. ఇప్పుడు హీరోయిన్‌గా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది నీహారికా.

హీరోయిన్ అంటేనే గ్లామ‌ర్‌. ఎంత గ్లామ‌ర‌స్‌గా క‌నిపిస్తే అన్ని అవ‌కాశాలు. పెద్ద కుటుంబానికి చెందిన పిల్ల‌గా నీహారికా కాస్త ప‌ద్ద‌తిగా దుస్తులు వేసుకుంటేనే గ్లామ‌ర్‌ను ఒలికించాలి. ఎక్స్ పోజింగ్‌కు దూరంగా ఉంటూనే అందంగా క‌నిపించాలి. అందుకు ఆమె సిద్ధ‌మైపోయింద‌ని చెప్ప‌డానికి ఈ ఫోటోనే సాక్ష్యం. చీర కాని చీర‌లో లూజ్ హెయిర్‌తో నీహారికా మెరిసిపోతున్న ఫోటో ఇన్ స్ట్రాగ్రామ్‌లో పోస్టు చేసింది. నా ద‌గ్గ‌ర గ్లామ‌ర్‌కు ఏం త‌క్కువ లేద‌న చెబుతున్న‌ట్టు ఉంది ఆ ఫోటో. గ‌తంలో ఆమె న‌టించిన సినిమా ఒక మ‌న‌సు. అందులో చీర‌క‌ట్టులో జ‌డ‌లో పూల‌తో చాలా ప‌ద్ద‌తిగా ఉంది. ఎక్క‌డా గ్లామ‌ర్ అనేది క‌నిపించేలేదు. ఆమె మోడ్ర‌న్ దుస్తుల్లో ఎలా ఉంటుందో అన్న సందేహం ఉన్న వారికి తాజా ఫోటో అన్ని అనుమానాలు తీర్చేస్తుంది.

నీహారిక త‌మిళంలో విజ‌య్ సేతుప‌తి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసింది. తెలుగులో కేవ‌లం ఒకే ఒక్క సినిమాలో చేసిన ఈ అమ్మాయికి త‌మిళంలో అంత పెద్ద సినిమాలో అవ‌కాశం రావ‌డం అప్ప‌ట్లో అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటో చూసి సెలెక్ట్ చేసిన‌ట్టు ఆ సినిమా ద‌ర్శ‌కుడు చెప్పాడు. ఇప్పుడు తెలుగులో యూవీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో హ్యాపీ వెడ్డింగ్ సినిమాలో చేస్తోంది. సుమంత్ అశ్విన్ ఇందులో హీరో.