Begin typing your search above and press return to search.

మెగా హీరోయిన్‌ 'సూర్యకాంతం' వేషాలు

By:  Tupaki Desk   |   5 Nov 2018 12:15 PM GMT
మెగా హీరోయిన్‌ సూర్యకాంతం వేషాలు
X
మెగా హీరోయిన్‌ నిహారిక ఇప్పటి వరకు తెలుగులో రెండు చిత్రాలు చేశాయి. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్‌ చిత్రాలు రెండు కూడా నిహారికకు నిరాశ పర్చాయి. అయితే ఆమె నటిగా మాత్రం మంచి పేరును సంపాదించుకోగలిగింది. నిహారిక ప్రస్తుతం శ్రియతో కలిసి ఒక లేడీ ఓరియంటెడ్‌ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఆ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది. తాజాగా మరో సినిమాకు నిహారిక కమిట్‌ అయినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

నిహారిక ఒక రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌ కు ఓకే చెప్పిందట. ఆ చిత్రానికి ‘సూర్యకాంతం’ అనే టైటిల్‌ ను కూడా ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. ప్రనీత్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఒక విభిన్నమైన ప్రేమ కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు. రాహుల్‌ విజయ్‌ - నిహారిక జంటగా ఈ చిత్రంలో నటించబోతున్నారు. నిహారిక గత చిత్రాలతో పోల్చితే ఈ చిత్రం కాస్త కమర్షియల్‌ హంగులు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.

నటిగా మంచి గుర్తింపు అయితే దక్కించుకున్న నిహారిక కమర్షియల్‌ సక్సెస్‌ కోసం ఎదురు చూస్తుంది. ఇలాంటి సమయంలో నిహారికకు ఎలాంటి ఫలితం దక్కుతుందో చూడాలి. శ్రియతో కలిసి చేస్తున్న లేడీ ఓరియంటెడ్‌ మూవీ, మరియు సూర్యకాంతం చిత్రాలు రెండు కూడా వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. మరో వైపు తమిళంలో కూడా నిహారిక సినిమాలు చేస్తోంది. ఇప్పటికే నిహారిక తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. కాని పెద్దగా అక్కడ కూడా సక్సెస్‌ లను దక్కించుకోలేక పోయింది.

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక అమ్మాయి అవ్వడంతో సినీ వర్గాల దృష్టి ఎక్కువగా ఈమెపై ఉంటుంది. ప్రేక్షకులు కూడా నిహారిక సినిమాలపై అంచనాలు పెట్టుకుంటున్నారు. కాని ఈమె నటించిన సినిమాలు అంచనాలను అందుకోలేక పోతున్నాయి. ఈసారి అయినా నిహారిక అంచనాలను అందుకుంటుందో చూడాలి.