Begin typing your search above and press return to search.

యంగ్ హీరోపై మెగా ప్రిన్సెస్ వీరంగం

By:  Tupaki Desk   |   30 April 2020 3:20 PM IST
యంగ్ హీరోపై మెగా ప్రిన్సెస్ వీరంగం
X
మెగా ఇమేజ్ మెగా డాట‌ర్ నిహారికకు ఏమాత్రం క‌లిసి రాలేద‌ని తాజా స‌న్నివేశం చెబుతోంది. ఆరంభ అవ‌కాశాల్ని ఇచ్చినా స‌క్సెస్ ని మాత్రం ఇవ్వ‌లేదు. సెంటిమెంటు ప‌రిశ్ర‌మ‌లో స‌క్సెస్ ఒక్క‌టే గీటు రాయి. కానీ ఆ ఒక్క‌టీ ద‌క్క‌లేదు. ఇటీవ‌ల‌ అవ‌కాశాలు అందుకోవ‌డంలో బాగా వెనుక‌బడింది ఇందుకే. `ఒక మ‌న‌సు` చిత్రంతో నాయిక‌గా కెరీర్ మొద‌లైనా ఈ నాలుగేళ్ల‌లో న‌త్త న‌డ‌క‌నే సాగింది. అటు కోలీవుడ్ లోనూ..ఇటు మాతృభాష‌లోనూ బ్యాలెన్స్ చేయాల‌ని చూస్తున్నా టేకాఫ్ కుద‌ర‌డం లేదు. చివ‌రిసారిగా `సూర్య‌కాంతం` అనే లేడీ ఓరియేంటెడ్ సినిమాతో అదృష్టం ప‌రీక్షించుకుంది. ఆ సినిమా ఫ‌లితం ఊహించ‌ని విధంగా నిరాశ‌నే మిగిల్చింది. దీంతో మెగా డాట‌ర్ కెరీర్ ముగిసిన‌ట్లేన‌ని క‌థ‌నాలొచ్చాయి. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు చెప్పిన‌ట్లు మంచి కుర్రాడు దొరకితే పెళ్లి ఖాయ‌మేన‌న్న ముచ్చ‌టా సాగింది.

నిహారిక అదృష్ట‌మో.. దురదృష్ట‌మో ..! క‌రోనా మ‌హమ్మారీ కార‌ణంగా మొత్తం స‌న్నివేశ‌మే మారిపోయింది. ఈ ఏడాది పెళ్లిళ్లు అన్నీ ఆగిపోయాయి. పెళ్లి కుదిరిన నిఖిల్.. నితిన్ ఎంగేజ్ మెంట్ వేడుక‌లు పూర్తిచేసుకుని వెయిట్ చేస్తున్నారు. నిహారిక పెళ్లి కి సంబంధించిన అప్ డేట్ వ‌చ్చే వీలుంటుంద‌ని ఈ సంద‌ర్భంలో ఫ్యాన్స్ భావించారు. అయితే ఈ ఏడాది పెళ్లి నుంచి ఎస్కేప్ అయింది. ప్ర‌స్తుత‌ లాక్ డౌన్ స‌మ‌యంలో ప్ర‌భాస్ తో పెళ్లి రూమ‌ర్ల‌పైనా నీహారిక క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఇదే టైమ్ లో కోలీవుడ్ లో మ‌రో హిడెన్ ఛాన్స్ నిహారిక‌ను ఊరించ‌డం విశేషం. యంగ్ హీరో అశోక్ సెల్వ న‌టించ‌నున్న కొత్త చిత్రంలో నిహారిక‌ను హీరోయిన్ గా ఎంపిక చేసారు. దీంతో మెగా డాట‌ర్ కి కోలీవుడ్ రెండో ఛాన్స్ ద‌క్కిన‌ట్ట‌య్యింది. `ఒక మ‌న‌సు` త‌ర్వాత విజ‌య్ సేతుపతి హీరోగా న‌టించిన `ఒరు న‌ల్లా నాల్ పాతు సోల్రెన్` సినిమాలో అమ్మ‌డు సెకెండ్ లీడ్ లో న‌టించింది.

కానీ ఆ సినిమా త‌న‌కు త‌మిళంలో పెద్ద‌గా గుర్తింపును తీసుకురాలేదు. దీంతో సెకెండ్ ఛాన్స్ రాలేదు. ఈ నేప‌థ్యంలోనే తెలుగు సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది. ఇక్క‌డే అడ‌పా ద‌డపా అవ‌కాశల‌తో నెట్టుకొచ్చేస్తోంది. ఇంత‌లో అశోక్ సెల్వ‌న్ స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ అందుకుంది. ఈ చిత్రాన్నిస్వాతి అనే ఓ మ‌హిళా ద‌ర్శ‌కురాలు డైరెక్ట్ చేస్తుంది. ద‌ర్శ‌కురాలిగా ఆమెకిదే తొలి చిత్రం కావ‌డం విశేషం. గ‌తంలో సుశీంద్ర‌న్ స‌హా ప‌లువురి వ‌ద్ద స‌హాయ ద‌ర్శ‌కురాలిగా స్వాతి ప‌ని చేశారు. కామెడీ-రొమాన్స్..వినోదం నేప‌థ్యంలో సాగే చిత్రానికి ఆమె ప్లాన్ చేస్తున్నారు. లాక్ డౌన్ త‌ర్వాత షూటింగ్ ప్రారంభం కానుందట‌. ప్ర‌స్తుతం లాక్ డౌన్ స‌మ‌యాన్ని ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌కు వినియోగించుకుంటున్నారు.