Begin typing your search above and press return to search.

చీర‌లో మ‌రీ ఓల్డ్ అయిపోయావ్ అంటూ..!

By:  Tupaki Desk   |   26 Sep 2019 2:30 PM GMT
చీర‌లో మ‌రీ ఓల్డ్ అయిపోయావ్ అంటూ..!
X
మెగా ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన తొలి హీరోయిన్ నిహారిక కొణిదెల. తెలుగులో వెబ్ సిరీస్ ల సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టిన ప్ర‌తిభావ‌ని. ముద్ద‌ప‌ప్పు ఆవ‌కాయ సిరీస్ లో న‌టించిన నిహారిక‌.. తండ్రి నాగ‌బాబుతో క‌లిసి `నాన్న కూచి` వంటి వెబ్ సిరీస్ లో అల‌రించింది. `ఒక మ‌న‌సు`తో వెండితెర‌పై క‌థానాయిక‌గా తెరంగేట్రం చేసింది. అమ్మాయిలు ఎందుకు న‌టించకూడ‌దు? అంటూ బ‌ల‌మైన వాద‌న వినిపించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక కు ఎంట్రీ సాఫీగానే కుదిరింది కానీ అనుకున్న స్థాయిలో మాత్రం స‌క్సెస్ రాలేదు.

హ్యాపీవెడ్డింగ్ - సూర్య‌కాంతం లాంటి ప్ర‌య‌త్నాలు స‌క్సెస్ నివ్వ‌క‌పోవ‌డం నిరాశ‌ను మిగిల్చింది. అందుకే ఇటీవ‌ల‌ మ‌ళ్లీ వెబ్ సిరీస్ ల బాటప‌ట్టింది. త‌ను న‌టిస్తున్న‌ తాజా వెబ్ సిరీస్ `మ్యాడ్ హౌజ్‌`. పూర్తి వినోదంతో ఈ వెబ్ సిరీస్ ని వంద ఎపిసోడ్‌లు షూట్ చేశారు. అధికారికంగా సిరీస్ ని ఇటీవ‌లే లాంచ్ చేశారు నిహారిక‌. ప్రస్తుతం చిరు న‌టించిన `సైరా న‌ర‌సింహారెడ్డి`లో మెరుపులా మెరిసే పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న నిహారిక ఇన్ స్టాలో బ్లూక‌ల‌ర్ సారీలో వున్న రెండు ఫొటోల‌ని పోస్ట్ చేసి దానికి `స్వైప్ నెక్ట్స్ టూ మేక్ మీ స్మైల్ ` అని ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌ను జోడించింది. దీనిపై నెటిజ‌నులు ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు.

చీర‌లో మ‌రీ ఓల్డ్ అయిపోయావ్ డార్లింగ్!! అంటూ కొంత మంది కామెంట్ చేస్తే రామ్ చ‌ర‌ణ్ సోద‌రి సుస్మిత మాత్రం `ఐ ల‌వ్ ఇట్‌` అంటూ కామెంట్ ని ట్యాగ్ చేశారు. నిహారిక‌ చీర‌క‌ట్టులో వున్న ఫొటోలు ప్ర‌స్తుతం ఇన్ స్టాలో వైర‌ల్ గా మారాయి.