Begin typing your search above and press return to search.

మెగా డాటర్ 'సూర్యాకాంతం'

By:  Tupaki Desk   |   12 Jan 2018 5:45 AM GMT
మెగా డాటర్ సూర్యాకాంతం
X
టాలీవుడ్ లో హీరోల కుటుంబాల నుండి ఈ మధ్య అమ్మాయిలు సినిమాల్లో బాగానే కనిపిస్తున్నారు. ఇక ఎంతో మంది యువ హీరోలు ఉన్న మెగా ఫ్యామిలి నుండి మొదటి హీరోయిన్ గా నిహారిక కొణిదెల ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలిసిందే. మొదటి సినిమా ఒక మనసు అంతగా హిట్ కాకపోయినా వెబ్ సిరీస్ లతో అలాగే రియాలిటీ షోలతో నిహారిక తనకంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో కోలీవుడ్ లో ఒక సినిమాని చేసే అవకాశం దక్కించుకుంది ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతోంది.

ఓరు నల్ల నాల్ పాతు సోల్రేన్ అనే సినిమాపై ప్రస్తుతం అంచనాలు బాగానే ఉన్నాయి. ఇకపోతే మరొక కొత్త కాన్సెప్ట్ తో నిహారిక ఒక ప్రయోగం చేయబోతోందని తెలుస్తోంది. సూర్యకాంతం అనే సినిమాను త్వరలోనే స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన న్యూస్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారింది. నిహారిక - సూర్యాకాంతంగా కనిపిస్తోంది అంటూ నెటీజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ముద్దపప్పు ఆవకాయ్ అనే వెబ్ సిరీస్ ను డైరెక్ట్ చేసిన ప్రణీత్ బ్రమంధపల్లి ఈ ప్రాజెక్టుకు దర్శకత్వం వహించబోతున్నాడు.

ఇక అదిత్ అరుణ్ - కాళిదాస్ హీరోలుగా కనిపించబోతున్నారు. త్వరలోనే సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేందుకు ఈ టీమ్ ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇంకా నిహారిక తండ్రి నాగబాబు ఈ ప్రాజెక్టును ఫైనల్ చేయాల్సి ఉందట. అప్పుడు అధికారికంగా సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసి షూటింగ్ ని స్టార్ట్ చేయనున్నారు. మరి నిహారిక సూర్యకాంతంతో ఎంతవరకు హిట్ అందుకుంటుందో చూడాలి. నిహారిక ఇప్పుడు సుమంత్ అశ్విన్ తో హ్యాపీ వెడ్డింగ్ అనే సినిమాతో కూడా వస్తున్న సంగతి తెలిసిందే.