Begin typing your search above and press return to search.

#నిశ్చ‌య్‌.. న‌వ్వించ‌డ‌మేనా.. ఇలా కొట్టే ఛాన్స్ కూడా..!

By:  Tupaki Desk   |   15 Dec 2020 10:35 AM IST
#నిశ్చ‌య్‌.. న‌వ్వించ‌డ‌మేనా.. ఇలా కొట్టే ఛాన్స్ కూడా..!
X
మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల టెకీ చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. ముచ్చ‌టైన జంట..! అంటూ అభిమానులు కితాబిస్తున్నారు. ఇక ఈ పెళ్లితో నాగ‌బాబు స‌హా మెగా ఫ్యామిలీ ఫుల్ ఖుషీగా సెల‌బ్రేష‌న్ మోడ్ లో ఉంది. మ‌రోవైపు కొత్త జంట రొమాంటిక్ ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

హ‌బ్బీని న‌వ్వించేస్తూ.. స‌ర‌దాగా ఆట ప‌ట్టిస్తూ .. ఇలా పెళ్లి ఆద్యంతం ఏ ఒక్క సంద‌ర్భాన్ని నిహారిక మిస్ చేసుకోలేద‌ని తాజాగా రివీలైన ఫోటోల్ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ఒక ర‌కంగా సెన్సిటివ్ హ‌బ్బీ చైత‌న్య‌ని డామినేట్ చేసేస్తోంది నిహారిక‌.

``ఒట్టు.. నిన్నిలా నవ్వించే ఏ ఒక్క అవకాశాన్ని నేను వదులుకోను. .. ఇలా కొట్టే అవకాశాన్ని కూడా..`` అంటూ ఓ ఫోటోని షేర్ చేయ‌గా..``నా కుటుంబాన్ని గర్వపడేలా చేశాను`` అని ఉంగరం ఆటలో తాను గెలుపొందిన మధుర జ్ఞాపకాలు నిహారిక వేరొక ఫోటో ద్వారా పంచుకున్నారు. అంత‌ర్జాలంలో ఈ ఫోటోలను వీక్షించి .. అంద‌మైన ముచ్చ‌టైన జంట అంటూ అభిమానులు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

ఉదయ్ పూర్ ఉదయ్‌విలాస్‌ ప్యాలెస్ ‌లో ఈ జంట పెళ్లి వైభవంగా సాగ‌గా.. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించారు. మునుముందు హ‌నీమూన్ కి సంబంధించిన వివ‌రం చెబుతారేమో చూడాల‌న్న ఆస‌క్తి అభిమానుల్లో ఉంది మ‌రి.