Begin typing your search above and press return to search.

'ఆచార్య' మరో స్పెషల్ క్యారెక్టర్.. యాక్టర్ ఎవరంటే..?

By:  Tupaki Desk   |   24 April 2020 4:30 PM GMT
ఆచార్య మరో స్పెషల్ క్యారెక్టర్.. యాక్టర్ ఎవరంటే..?
X
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా పై రోజురోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ మూవీని టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శివ కొరటాల తెరకెక్కిస్తుండగా మాట్నీ ఎంటర్టైన్మెంట్ మరియు కొణిదెల ప్రొడక్షన్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆచార్య అనే పేరును ఖరారు చేశారు. ఇప్పటికే చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మేలో నెక్స్ట్ షెడ్యూల్ మొదలుకావాల్సి ఉందట. సామాజిక అంశానికి కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది.

ఈ సినిమాలో రాంచరణ్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాలో రాంచరణ్ పాత్ర దాదాపుగా 30 నుండి 40నిముషాల వరకు ఉంటుందట. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో మెగా వారసురాలు నిహారిక నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఫిల్మ్ నగర్ టాక్. ఇదివరకే మెగాస్టార్ 'సైరా'లో ప్రత్యేక పాత్రలో కనిపించింది నిహారిక. ఇప్పుడు నిహారిక పేరు కూడా ఈ ప్రాజెక్టులో వినిపిస్తుండటంతో, మెగా అభిమానుల్లో మరింత ఆసక్తిని పెరిగింది. నిహారిక చేయడం నిజమే అయితే, ఆమె పాత్ర తీరు తెన్నులు ఎలా ఉంటాయనేది ఆసక్తి రేకెత్తించే అంశం.