Begin typing your search above and press return to search.

నిహారిక జిమ్ ఫోటోలు నెట్టింట వైర‌ల్!

By:  Tupaki Desk   |   26 April 2022 3:30 PM GMT
నిహారిక జిమ్ ఫోటోలు నెట్టింట వైర‌ల్!
X
మెగా డాట‌ర్ నిహారిక ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారుతోన్న సంగ‌తి తెలిసిందే. రేవ్ పార్టీ ఘ‌న‌ట‌లో నిహారిక పేరు వెలుగులోకి రావ‌డంతో నిహారిక‌ని పెద్ద ఎత్తున ట్రోల్ చేసారు. ఆ ఘ‌ట‌న త‌ర్వాత నిహారిక ఇన్ స్టా ఖాతాని కూడా డిలీట్ చేసారు. ఆ త‌ర్వాత నిహారిక బ‌య‌ట ఎక్క‌డా క‌నిపించ‌లేదు. సోషల్ మీడియా ద్వారా అభిమానుల‌కు ట‌చ్ లో లేరు.

అయితే తాజాగా నిహారిక జిమ్ లో వ‌ర్కౌట్లు అనంత‌రం రిలాక్స్ అవుతోన్న టైమ్ లో దిగిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ ఫోటోలో నిహారిక బ్లాక్ క‌ల‌ర్ షార్ట్ ..పింక్ క‌ల‌ర్ బ‌నియ‌న్ లో క‌నిపిస్తున్నారు. ఆ ప‌క్క‌నే జిమ్ ట్రైయిన‌ర్ ఉన్నారు. ఆయ‌న‌ భుజంపై నిహారిక చేతులు వేసి ఫోజులిచ్చారు. ఇందులో నిహారిక హెయిర్ కూడా షార్ట్ గా క‌నిపిస్తుంది.

అలా నిహారిక న‌వ్వుతూ ఇచ్చిన ఫోజులు ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. చాలా రోజుల త‌ర్వాత ఇలా క‌నిపించ‌డంతో ఆమె అభిమానులు సంబ‌ర‌ప‌డుతున్నారు. ఇన్ని రోజులు ఏమై పోయావ్ నిహారిక‌? అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. ఇక నిహారిక పెళ్లి త‌ర్వాత న‌ట‌న‌కు దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. నిర్మాత‌గా బిజీ అయ్యే ప్ర‌యత్నాల్లో ఉంది.

వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది ఆమె 'ఒక‌ చిన్న ఫ్యామిలీ స్టోరీ' అనే వెబ్ సిరీస్ ని నిర్మించారు. జీ-5 లో ఆ సిరీస్ రిలీజ్ యింది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ ఎలాంటి సిరీస్ లు నిర్మించ‌లేదు.

న‌టిగా చివ‌రిగా మెగాస్టార్ చిరంజీవి న‌టించిన 'సైరా న‌రసింహారెడ్డి' లో ఓ గిరిజ‌న యువ‌తి పాత్ర‌లో న‌టించారు. 'ఒక మ‌న‌సు' సినిమాతో 2016 లోనే తెరంగేట్రం చేసారు.

ఆ త‌ర్వాత 'హ్యాపీ వెడ్డింగ్'..'సూర్య‌కాంతం' సినిమాల్లో న‌టించారు. అలాగే కోలీవుడ్ లోనూ ఓ సినిమా చేసారు. కానీ న‌టిగా ఎక్క‌డా బిజీ కాలేదు. వీట‌న్నింటి కంటే ముందు బుల్లి తెర‌పై ఎంట్రీ ఇచ్చారు. అక్క‌డ నుంచి పెద్ద తెర‌కి ప్ర‌మోట్ అయిన సంగ‌తి తెలిసిందే.