Begin typing your search above and press return to search.

మెగా డాటర్‌ మాయం వెనుక కారణం ఏంటో?

By:  Tupaki Desk   |   9 March 2022 10:00 PM IST
మెగా డాటర్‌ మాయం వెనుక కారణం ఏంటో?
X
మెగా బ్రదర్‌ నాగబాబు కూతురు నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. చిరంజీవి కూతుర్లు ఇద్దరు కూడా ఇండస్ట్రీకి నటనకు దూరంగా ఉంటూ వచ్చారు. కాని నాగబాబు కూతురు మాత్రం మల్టీ ట్యాలెంట్‌ అనిపించుకున్నారు. ఆమె బుల్లి తెర నుండి వెండితెర వరకు ఎన్నో మాధ్యమాల ద్వారా సందడి చేసింది.. హడావుడి చేసింది.. ఎంటర్‌ టైన్ చేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.

నిహారిక హీరోయిన్‌ గా సక్సెస్ లు దక్కించుకోవాలని.. కమర్షియల్‌ గా మంచి హీరోయిన్ గా నిలవాలని.. నటిగా మంచి పేరును దక్కించుకోవాలని చాలా ప్రయత్నాలు చేసింది. ఆమెకు అందుకు అవకాశం కూడా నాగబాబు ఇచ్చాడు. కాని ఆమె కు లక్‌ కలిసి రాక సినిమాల్లో హీరోయిన్ గా సక్సెస్ కాలేదు. దాంతో ఆమెకు నాగబాబు పెళ్లి చేశాడు. జేవీ చైతన్య తో నిహారిక పెళ్లి ఆమద్య వైభవంగా జరిగింది.

పెళ్లికి ముందు పెళ్లి తర్వాత ఇన్‌ స్టా గ్రామ్‌ లో నిహారిక సందడి ఎంత చెప్పినా తక్కువే. ప్రతి విషయాన్ని ఎమోషన్‌ ను పోస్ట్‌ ల రూపంలో లేదా స్టోరీ రూపంలో షేర్ చేస్తూ వచ్చింది. పెయిడ్‌ ప్రమోషన్స్ ద్వారా మంచి సంపాదన కూడా నిహారిక దక్కించుకున్నారు అనేది టాక్‌. ఆ విషయం పక్కన పెడితే నిహారిక ఇన్‌ స్టా గ్రామ్‌ అకౌంట్‌ మిస్‌ అయ్యింది. గత కొన్ని రోజులుగా ఆమె ఇన్ స్టా గ్రామ్ లో సందడి చేయక పోవడంతో అనుమానం వచ్చి చెక్ చేస్తే ఆమె అకౌంట్‌ కనిపించడం లేదు.

నిహారిక ఉన్నట్లుండి ఇన్‌ స్టా గ్రామ్ నుండి తప్పుకోవడం పై మెగా అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా చిన్నా చితకా సెలబ్రెటీలు ఇన్ స్టా లో జాయిన్‌ అవుతున్న ఈ సమయంలో నిహారిక తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇండస్ట్రీ నుండి పూర్తిగా తప్పుకున్నది లేదు. నిర్మాతగా కూడా ఇటీవల ఆమె నుండి సినిమా వచ్చింది. తన రెగ్యులర్ అప్‌డేట్స్ ను షేర్‌ చేస్తూనే ఉంది.

ఇంతలో ఇన్‌ స్టా నుండి ఆమె అకౌంట్‌ లేకపోవడం చర్చనీయాంశం అయ్యింది. మొదట ఈమె అకౌంట్‌ హ్యాక్ అయ్యింది.. లేదంటే మరేదైనా టెక్నికల్‌ ఇష్యూ అనుకున్నారు. అదే జరిగి ఉంటే నిహారిక ఏదో ఒక విధంగా స్పందించే వారు. కాని ఆమె అకౌంట్ ను స్వయంగా తొలగించడం వల్లే స్పందించడం లేదు అనేది టాక్‌. ఆమద్య నిహారిక పెట్టిన ఒక పోస్ట్ కు వచ్చిన కామెంట్స్ కారణంగానే ఆమె ఇన్‌ స్టా నుండి బయటకు వెళ్లి పోయింది అనే టాక్ మొదలు అయ్యింది.

అసలు విషయం ఏంటీ అనేది త్వరలో వెల్లడి అవుతుందేమో చూడాలి. నటిగా.. యాంకర్‌ గా.. నిర్మాతగా.. ఫిల్మ్‌ మేకర్‌ గా ఇలా ఎన్నో విధాలుగా ఇండస్ట్రీలో రాణించిన నిహారిక పెళ్లి తర్వాత సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా పోస్ట్‌ లు పెట్టాలి.. ఆమె గురించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని అభిమానులు కోరుకున్నారు. కాని ఆమె ఇన్‌ స్టా గ్రామ్‌ ఇప్పుడు మాయం అయ్యింది. కారణం ఏంటో అనేది తెలియ రావాల్సి ఉంది.