Begin typing your search above and press return to search.

#నిహారిక‌.. రెండ్రోజుల్లో ఏకంగా 12 జ‌త‌లు మార్చారు

By:  Tupaki Desk   |   11 Dec 2020 10:45 AM IST
#నిహారిక‌.. రెండ్రోజుల్లో ఏకంగా 12 జ‌త‌లు మార్చారు
X
కొణిదెల వార‌మ్మాయి నిహారిక‌ను జొన్న‌ల‌గ‌డ్డ వార‌బ్బాయి చైత‌న్య ప‌రిణ‌య‌మాడారు. రాజ‌స్థాన్ ఉద‌య్ పూర్ లో జ‌రిగిన ఈ పెళ్లికి మెగా అల్లు కుటుంబాలు హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. టోట‌ల్ మెగా హీరోలంతా ఒకే ఫ్రేమ్ లో సంద‌డి చేయ‌గా.. మెగా అల్లు ఫ్యామిలీ క‌పుల్స్ ఈ వేడుక‌కే ప్ర‌త్యేక శోభ‌ను తెచ్చారు.

చ‌ర‌ణ్ - ఉపాజ‌న జంట‌.. బ‌న్ని- స్నేహారెడ్డి జంట‌తో పాటు బాబి- నీలిమ జంట‌.. క‌ళ్యాణ్ దేవ్ - శ్రీ‌జ జంట‌.. సుశ్మిత‌-ప్ర‌సాద్ జంట ఈ వేదిక వ‌ద్ద ఎంతో సంద‌డి చేశారు. ఇక వీళ్లంతా ర‌క‌ర‌కాల సాంప్ర‌దాయ దుస్తుల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌గా వాటిని డిజైన్ చేయించేందుకు ల‌క్ష‌ల్లో ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది. ప్ర‌తి ఈవెంట్లోనూ ఒక్కో డిజైన‌ర్ లుక్ తో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. ఇక మెగా డాట‌ర్స్ అంతా డిజైన‌ర్ చీర‌ల్లో వైబ్రేంట్ మోడ్ర‌న్ డ్రెస్సుల్లో క‌నిపించారు.

ఉద‌య్ ప్యాలెస్ లో మెగా హీరోలు ధ‌రించిన డ్రెస్సుల‌పైనే అంద‌రి క‌ళ్లు. ర‌క‌ర‌కాల షేర్వాణీ లు కుర్తా పైజామాల్లో వీరంతా ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపించారు. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్స్ రూపొందించిన ఈ డిజైన్లు ఎంతో ట్రెడిష‌న‌ల్ లుక్ ని తెచ్చాయి. ముఖ్యంగా బ‌న్ని అయితే అంద‌రికంటే కాస్ట్ లీగానే డ్రెస్ ల‌ను డిజైన్ చేయించుకుని త‌న‌దైన ప్ర‌త్యేక‌తను చాటుకునే ప్ర‌య‌త్నం చేశారు. చ‌ర‌ణ్ సింప్లిసిటీతో కూడుకున్న డిజైన్ల‌ను ఎంపిక చేసుకోగా వ‌రుణ్ తేజ్.. వైష్ణ‌వ్ తేజ్ లాంటి హీరోలు వైబ్రేంట్ డిజైన్ల‌తో స్ట్రైకింగ్ గా క‌నిపించారు.

అన్న‌ట్టు రెండు రోజుల డెస్టినేష‌న్ వెడ్డింగ్ లో ఒక్కొక్క‌రు ఎన్ని జ‌త‌లు మార్చారు? అన్న‌ది ఆరా తీస్తే.. సుమారు 12 జ‌త‌లు ఎడాపెడా మార్చేశార‌ని ఫోటో ప్రూఫ్ లు చెబుతున్నాయి. ప్రీవెడ్డింగ్ సెల‌బ్రేష‌న్స్ మొద‌లు సంగీత్.. మెహెందీ.. ప‌సుపు కార్య‌క్ర‌మం అంటూ ప్ర‌తిచోటా ఓ కొత్త డిజైన‌ర్ లుక్ తో క‌నిపించేందుకు మెగా హీరోలు త‌పించారు.